‘బిపార్జోయ్’ రెడ్ అలర్ట్: 15న తీరాన్ని తాకనున్న తీవ్ర తుపాను, జుహూ బీచ్‌లో నలుగురు గల్లంతు
గాంధీనగర్: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాను అతితీవ్ర తుపానుగా మారి గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోంది. గురువారం నాడు బీపర్‌జోయ్ తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ తుపాను ప్రభావం ఎక్కువగా గుజరాత్, మహారాష్ట్రలపై ఉంది. ఈ రెండు రాష్ట్రాల తీరాల్లో సముద్రం భారీ అలలతో విరుచుకుపడుతోంది.
బిపార్జోయ్ తుఫాను ప్రభావంతో మహారాష్ట్ర సముద్ర తీరంలో నలుగురు గల్లంతయ్యారు. ముంబైలోని జుహు బీచ్‌లో బలమైన అలల తాకిడికి నలుగురు కొట్టుకుపోయారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) కూడా హై అలర్ట్‌లో ఉంది. అనేక అత్యవసర బృందాలను చర్య కోసం సిద్ధంగా ఉంచింది. తుఫాను భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలో రైల్వే, విమాన రాకపోకలను కూడా ప్రభావితం చేసింది.

బిపార్జోయ్ తుఫాను 'అత్యంత తీవ్ర తుఫాను'గా మారుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఇది జూన్ 14 వరకు ఉత్తర దిశగా కదులుతూ సౌరాష్ట్ర-కచ్ తీరం వైపు, జూన్ 15 మధ్యాహ్నానికి దాటుతుంది. తూర్పు-మధ్య ఆనుకుని ఉన్న ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా బీపర్జోయ్ తుఫాను ఉగ్రరూపం దాల్చడంతో సౌరాష్ట్ర, కచ్ తీరాలకు జూన్ 14న ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. జూన్ 15న అన్ని కోస్తా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 1965 తర్వాత జూన్‌లో గుజరాత్‌ను తాకిన మూడో తుఫాను ఇదేనని వాతావరణ కేంద్రం తెలిపింది.
కాగా, ముంబైలోని జుహు బీచ్‌లో నలుగురు వ్యక్తులు గల్లంతైన నేపథ్యంలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా యంత్రాంగం తీరం వెంబడి ప్రజల రాకపోకలను నిషేధించింది. సన్నద్ధత, రెస్క్యూ, పునరుద్ధరణకు సంబంధించిన ప్రయత్నాలలో గుజరాత్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, కోస్ట్ గార్డ్‌ల నుంచి తగిన సంఖ్యలో బృందాలు, వనరులను మోహరించాలని కేంద్ర హోం శాఖ కార్యదర్శి సంబంధిత అధికారులను కోరారు.
మరోవైపు, బీపార్జోయ్ తుపాను పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని సూచించారు. విద్యుత్తు, తాగునీరు, వైద్యం వంటి అత్యవసర సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టేలా సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారని ప్రధానమంత్రి కార్యాయలం తెలిపింది. తుపాను పరిస్థితులను కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోందని వెల్లడించింది.
#WATCH | Maharashtra: High tidal waves witnessed in Mumbai as cyclone #Biparjoy intensified into a severe cyclonic storm.
— ANI (@ANI) June 12, 2023
(visuals from Gateway of India) pic.twitter.com/UrnR0sahtE
కాగా, జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ కూడా బిపార్జోయ్ తుపాను సంసిద్ధత చర్యలను సమీక్షించింది. మరోవైపు, పశ్చిమ తీరం వెంబడి NDRF అదనపు బృందాలను మోహరించింది. ముందుజాగ్రత్త చర్యగా ముంబైలో ఇప్పటికే అందుబాటులో ఉన్న మూడు బృందాలకు అదనంగా మరో రెండు బృందాలను మోహరించింది. మరో నాలుగు జట్లను గుజరాత్‌కు తరలించి పుణె యూనిట్లను సిద్ధంగా ఉంచింది.
ఇది ఇలావుండగా, తుపాను కారణంగా పశ్చిమ రైల్వేకు చెందిన 67 రైళ్లు ఇప్పటివరకు రద్దు చేయబడ్డాయి. బైపార్జోయ్ తుఫాను కారణంగా, జూన్ 15 నాటికి రద్దు చేయబడిన రైళ్ల సంఖ్య 95 కి చేరుకుంటుంది. విమానాల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. అరేబియా సముద్రంలో తుఫాను విజృంభించడంతో అనేక విమానయాన సంస్థలు విమానాలను రద్దు చేయవలసి వచ్చింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications