తీరంవైపు దూసుకొస్తున్న మొంథా తుఫాన్: 4 రాష్ట్రాలకు IMD రెడ్ అలర్ట్!

IMD Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ఇప్పుడు మరింత తీవ్రరూపం దాల్చింది. ఇది మంగళవారం ఉదయమే తుఫానుగా మారింది. ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతోంది. ఈ తుఫాను మంగళవారం సాయంత్రం గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ కారణంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా సహా మధ్య, ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ భారీ వర్షాల రెడ్ అలర్ట్ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకనున్న తుఫాన్
వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మొంథా తుఫాన్ మంగళవారం సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కొన్నిసార్లు ఈ వేగం గంటకు 110 కిలోమీటర్ల వరకు కూడా పెరగవచ్చు. ఈ తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 420 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతోంది.

Cyclone Montha Hits AP Coast IMD Red Alert for 4 States

నాలుగు రాష్ట్రాలపై అత్యధిక ప్రభావం
ఈ తీరప్రాంత రాష్ట్రాల్లో సోమవారం ఉదయం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే 50 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తీర ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF) బృందాలను మోహరించారు. తుఫాన్ కారణంగా అత్యధిక 4 రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తుఫాన్ తీరాన్ని తాకనున్న నేపథ్యంలో భారీ వర్షాలు, బలమైన గాలులు ఉండనున్నాయి. మంగళవారం రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.

తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు
తమిళనాడులోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ తీరం దాటిన తర్వాత ఒడిశా వైపు కదులుతుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిగువ ప్రాంతాలు నీట మునిగాయి. ఇద్దరు మరణించినట్లు సమాచారం. మంగళవారం కూడా వర్షాల హెచ్చరిక ఉన్నప్పటికీ సాయంత్రం నుంచి తీవ్రత తగ్గుతుంది. పశ్చిమ బెంగాల్‌లో మంగళవారం నుంచి శుక్రవారం వరకు డార్జిలింగ్, కాలింపాంగ్, 24 పరగణాస్, మేదినీపూర్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంది.

మధ్య, ఉత్తర భారతంలో వర్షాలు
మొంథా తుఫాన్ ప్రభావం మధ్య, ఉత్తర భారతంలోని రాష్ట్రాలపై కూడా కనిపిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో గత 24 గంటల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 3 రోజులకు వర్షాల అలర్ట్ ఉంది. మంగళవారం నారాయణ్‌పూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యాయి. రాబోయే నాలుగు రోజులకు భారీ వర్షాలు, గాలుల హెచ్చరిక ఉంది.

రాజస్థాన్‌లో సోమవారం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి, దీనివల్ల ఉష్ణోగ్రత 6 నుంచి 8 డిగ్రీలు తగ్గి చలి పెరిగింది. ఉదయ్‌పూర్‌లో ఫతేసాగర్ సరస్సు గేట్లు కూడా తెరవాల్సి వచ్చింది. మంగళవారం 23 జిల్లాలకు వర్షాల అలర్ట్ ఉంది. ఉత్తరప్రదేశ్, ఎన్సీఆర్‌లలో మంగళవారం ఉదయం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. గంటకు 20 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. 11 జిల్లాలకు వర్షాల అలర్ట్ ఉంది. ఎన్‌సీఆర్ (నేషనల్ క్యాపిటల్ రీజియన్)లో కూడా రాబోయే రెండు రోజులు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+