తౌక్తే తుపాను బీభత్సం: కొవిడ్ ఆస్పత్రుల్లో పవర్ కట్స్ -సీఎంలకు అమిత్ షా నిర్దేశం -కర్ణాటకలో నలుగురు మృతి

అరేబియా తీరాన్ని ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో తౌక్తే తుపాను బీభత్సం సృష్టిస్తున్నది. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, గోవాల్లో పరిస్థితి గంటగంటకూ మారుతున్నది. ఈ నెల 18న ఉదయం గుజరాత్‌ వద్ద తీరం దాటుతుందని భావిస్తోన్న తౌక్తే తుపాను ప్రస్తుతం పంజిమ్‌-గోవాకు నైరుతి దిశలో 170 కిలోమీటర్లు, ముంబై 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైఉంది. తీరం దాటడానికి ముందే తీవ్ర ప్రభావం చూపెడుతోంది..

తౌక్తే తుపాను ధాటికి కర్ణాటక తీర ప్రాంతంలోని ఆరు జిల్లాలు, మల్నాడ్‌లో భారీ వర్షపాతం నమోదైందని, వర్షాల కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారని కర్ణాటక రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (కేఎస్‌డీఎంఏ) ఆదివారం తెలిపింది. తుపానుకు 73 గ్రామాలు ప్రభావితమయ్యాయని, ఇప్పటి వరకు నలుగురు మృతి చెందారని తెలిపారు.

 Cyclone Tauktae: 4 dead in Karnataka, power cuts in Goas covid hospital, Maha CM with Amit Shah

గోవా తీర ప్రాంతాలు, రాజధాని పనాజీని తౌక్తే అతలాకుతలం చేస్తున్నది. తుపాను దాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోగా చాలా చోట్ల కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పనాజీలోని ఓ ఆస్పత్రి ఆవరణలో చెట్లు కూలడంతో కొవిడ రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. తుపాను నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పారు.

తౌక్తే తుపాను బీభత్సం నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం కీలక సమీక్షలు నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీలతో షా కాన్ఫరెన్స్ నిర్వహించారు. విలయాన్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉండాలని, కేంద్రం నుంచి అన్ని రకాలుగా సహాయం అందజేస్తామని షా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+