• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Cyclone Tauktae:తుఫాన్‌లకు పేర్లు ఎలా వచ్చాయి..? తౌటే అంటే అర్థం ఏంటి..?

|

అరేబియన్ సముద్రంలో తౌటే తుఫాను ఉగ్రరూపం దాలుస్తోంది. మరో ఆరుగంటల్లో తీవ్ర తుపానుగా మారనుంది. మంగళవారం మధ్యాహ్న సమయానికి గుజరాత్ తీరంను తాకే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరో 12 గంటల సమయంలో అతి ప్రమాదకరంగా తౌటే తుఫాను మారబోతోంది. మంగళవారం మధ్యాహ్న సమయానికల్లా పోరబందర్ - నాలియా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది తొలి తుఫానుగా సైక్లోన్ తౌటే గుర్తింపు పొందింది. ఓ వైపు కరోనా వైరస్ మరోవైపు ఈ తుఫానుతో పలు రాష్ట్రాలు వణుకుతున్నాయి. ఇప్పటికే కేరళ, కర్నాటక, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ తుఫాన్లకు పేర్లు ఎలా వస్తున్నాయి.. ఎవరు పెడుతున్నారు.. ఎందుకు పెడుతున్నారనే విషయం తెలుసా..?అయితే ఈ స్టోరీ చదవండి.

  Tauktae: తుఫాన్లకు పేర్లు ఎందుకు పెడుతున్నారు.. ఆసక్తికర కారణాలు How Cyclones Named?|Oneindia Telugu

  తౌటే అంటే అర్థం ఏంటి..?


  ప్రస్తుతం పలు రాష్ట్రాలను కుదిపేస్తోన్న తౌటే తుఫానుకు ఆ పేరును మియన్మార్ సూచించింది. బర్మా భాషలో దీన్ని గెకో అంటారు. అంటే ఓ భారీ బల్లి అని అర్థం. తుఫానుకు పేర్లు పెట్టడం ప్రపంచ వాతావారణశాఖ (WMO) సంస్థ నేతృత్వంలో జరుగుతుంది లేదా యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా పసిఫిక్ ప్యానెల్ (ESCAP) నేతృత్వంలో పేరుకు ఆమోదం తెలుపుతారు. ఈ ప్యానెల్‌లో 13 దేశాలు సభ్యులుగా ఉంటాయి. ఇందులో భారత్, బంగ్లాదేశ్, మియన్మార్, పాకిస్తాన్, మాల్దీవులు, ఒమన్, శ్రీలంక, థాయ్‌లాండ్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ వంటి దేశాలున్నాయి. ఈ దేశాల్లో వచ్చే తుఫాన్లకు ఈ 13 దేశాలే నామకరణం చేస్తాయి.

  2004లో 8 దేశాలు..64 పేర్లు

  2004లో 8 దేశాలు..64 పేర్లు

  2004లో ఈ సమాఖ్యలో 8 దేశాలుండేవి. ఈ 8 దేశాలు 64 పేర్లను రికమెండ్ చేశాయి. ఒక్కో దేశం 8 తుఫాను పేర్లను సూచించాయి. గతేడాది మే నెలలో భారత్‌ను తాకిన అంఫన్ తుఫాను జాబితాలో చివరి తుఫానుగా నిలిచింది. గతేడాది అరేబియన్ సముద్రంలో ఏర్పడ్డ నిసర్గ తుఫాను తాజా తుఫాను పేర్ల జాబితాలో తొలి పేరు. నిసర్గ పేరును బంగ్లాదేశ్ సూచించింది. 2018లో WMO/ESCAP దేశాల జాబితాను పెంచింది. మరో 5 దేశాలను చేర్చింది. దీంతో గతేడాది తుఫాను పేర్లున్న కొత్త జాబితాను విడుదల చేసింది. మొత్తం 169 పేర్లు ఇందులో ఉన్నాయి. అంటే ఒక్క దేశం 13 పేర్లను ఇచ్చాయి.

   తుఫాన్లకు పేర్లు ఎందుకు పెట్టారు

  తుఫాన్లకు పేర్లు ఎందుకు పెట్టారు

  ఇక తుఫాన్లకు పేర్లు పెట్టడం వల్ల పలు లాభాలు ఉన్నాయి. ముందుగా శాస్త్రవేత్తల వర్గం, నిపుణులు, విపత్తు నిర్వహణ బృందాలు ఇతర సాధారణ పబ్లిక్‌లు తుఫానును పేరుతో గుర్తించగలిగే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ ఒకేసారి రెండు తుఫాన్లు వస్తే ఒక్కో తుఫానుకు ఒక్కో పేరు ఉండటం వల్ల గందరగోళం ఏర్పడదు. దీంతో ముందస్తు హెచ్చరికలు చేయడం ద్వారా చాలా వరకు నష్టాన్ని నివారించగలుగుతారు. ఇక పేరు పెట్టడం వల్ల భవిష్యత్తులో గతంలో వచ్చిన ఫలానా తుఫాను గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఆ తుఫాను పేరుపై చర్చించొచ్చు. తుఫాన్లకు పేర్లు పెట్టేముందు అది కాస్త చిన్నదిగా, సింపుల్‌గా అందరికీ అర్థం అయ్యేలా ఉండాలి. మరో నిబంధన కూడా ఉంది. తుఫాన్లకు దేశాల పేర్లతో వచ్చేలా పెట్టకూడదు. ఇది చాలా సున్నితత్వమైన అంశం కనుక బాగా ఆలోచించి ఏదేశాన్ని కించపరిచే పేరు ఉండకూడదు.

  English summary
  Cyclone Tauktae, the cyclone likely to hit Gujarat coast, is a Burmese word meaning gecko.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X