Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Cyclone Yaas: రంగంలోకి మోదీ -ఒడిశా, బెంగాల్‌లో తుపాను నష్టంపై ప్రధాని సర్వే -సీఎంలతో సమీక్ష

యాస్ తుపాను అతీ తీవ్ర రూపంలో బుధవారం తీరాన్ని దాటింటి మొదలు గురువారం సాయంత్రం దాకా తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో విలయం సృష్టించిన యాస్.. జార్ఖండ్ లోనూ జలవిలయాన్ని కలుగజేసింది. ప్రధానంగా రెండు రాష్ట్రాల్లో తుపాను తీవ్ర నష్టం సృష్టించిన దరిమిలా ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ శుక్రవారం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

ఢిల్లీలోని త‌న నివాసం నుంచి శుక్రవారం ఉదయం బ‌య‌లుదేర‌నున్న ప్ర‌ధాని ముందుగా భువ‌నేశ్వ‌ర్‌కు వెళ్ల‌నున్నారు. అక్క‌డ ఉన్న‌తాధికారులతో స‌మావేశ‌మై ఒడిశాలో తుఫాన్ ప‌రిస్థితిపై స‌మీక్షించ‌నున్నారు. అనంత‌రం తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాలైన బాలాసోర్‌, భ‌ద్ర‌క్‌, పర్బ మేదినిపూర్‌ల‌లో ఆయ‌న ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించ‌నున్నారు. ఆ త‌ర్వాత ప‌శ్చిమ‌బెంగాల్‌కు వెళ్లనున్నారు. అక్క‌డ కూడా తుఫాన్ ప‌రిస్థితిపై ఉన్నతాధికారుల‌తో స‌మీక్ష చేయ‌నున్నారు.

Cyclone Yaas updtes: PM Modi to visit Odisha, Bengal to review storm impact on friday

రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు కోటి మంది యాస్ తుపాను వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒడిశాలోని లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యి, వేలాది ఇళ్లు నీటమునిగాయి. రెస్క్యూ బృందాలు బాధితులు అంద‌రినీ సుర‌క్షిత ప్రాంతాల‌కు తరలించడంతో ప్రాణనష్టం తప్పింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ బుధవారం వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే నిర్వ‌హించారు. స‌హాయ‌క శిబిరాల్లో బాధితుల‌కు భోజ‌నంతోపాటు వైద్య స‌దుపాయాల‌ను కూడా స‌మ‌కూర్చాల‌ని ఆదేశించారు.

బెంగాల్ లో యాస్ తుపాను దెబ్బకు ముగ్గురు చనిపోయారు. 20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మమత చెప్పారు. తుపాను సాయం ప్రకటనలో కేంద్రం పక్షపాత ధోరణి అవలంభిస్తున్నదని, రాజకీయంగా తనకు మద్దతిచ్చే పార్టీలున్న రాష్ట్రాలకు ఎక్కువ సాయం ఇస్తూ, వ్యతిరేక పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలకు అరకొరగా నిధులు విదుల్చుతున్నారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్న దరిమిలా రేపటి ప్రధాని పర్యటన రాజకీయంగానూ ఉత్కంఠ రేపుతున్నది. ఇదిలా ఉంటే,

యాస్ తుపాను క్రమంగా బలహీనపడుతూ జార్ఖండ్ రాష్ట్రంపై ప్రభావం చూపింది. గురువారం ఉదయం నుంచి గంటలపాటు జార్ఖండ్ రాజ‌ధాని రాంచిలో భారీ వ‌ర్షం కురిసింది. ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షంతో ప‌లు ప్రాంతాల్లో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. తుపాను ప్రభావంతో ఈ రోజంతా కూడా జార్ఖండ్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ద‌ని భారత వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. ఆకావం మేఘావృత‌మై ఉంటుంద‌ని తెలిపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+