రేపటినుండే పెట్రోల్, ఢీజీల్ ధరల్లో ప్రతిరోజూ మార్పులు, ఎస్ఎంఎస్ ద్వారా ధరలిలా..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగం సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ ధరలను శుక్రవారం నుండి రోజూవారీగా సవరించనున్నారు. అయితే ఈ విధానాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చిన పెట్రో డీలర్లు తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నారు.

ఆ 5 నగరాల్లో ప్రతి రోజూ పెట్రోల్, డీజీల్ ధరల్లో మార్పులు, పెరిగిన ధరలివే

ప్రతిరోజూ అర్ధరాత్రి కాకుండా ఉదయం ఆరుగంటలకు సవరించాలన్న తమ డిమాండ్ కు ప్రభుత్వం ఒప్పుకోవడంతో పెట్రోల్ బంకుల బంద్ నిర్ణయాన్ని ఉపసంహరించుకొన్నట్టు ప్రకటించారు పెట్రో డీలర్ల అసోసియేషన్.

Daily Petrol, Diesel Price Revision From Tomorrow, Dealers Won't Go On Strike

శుక్రవారం నుండి ప్రతిరోజూ పెట్రోల్, డీజీల్ ధర్లను సవరించాలని చమురు సంస్థలు నిర్ణయించాయి. దీన్ని వ్యతిరేకిస్తూ బంద్ చేయాలని డీలర్లు గతంలో నిర్ణయం తీసుకొన్నాయి. ఈ అంశంపై పెట్రోల్ డీలర్లు బుదవారం నాడు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రతో బేటీ అయ్యారు. ధరలను ఉదయం నుంచి మార్చేందుకు అవకాశం కల్పించాలని డీలర్లు కోరారు.

ఈ ప్రతిపాదనకు ఒప్పుకొన్నారు డీలర్లు. బంద్ ఉపసంహరించడంతో ముందుగా నిర్ణయించినట్టుగానే శుక్రవాంర నుండి ధరలను రోజువారీ సమీక్షించనున్నట్టు మంత్రి ధర్మేంద్ర ప్రకటించారు.

ఎస్ఎంఎస్ కొడితే ధరలిలా

పెట్రోల్, డీజీల్ ధరలను ఇక నుండి ప్రతి రోజూ సవరించాలని ఆయిల్ కంపెనీలు నిర్ణయించాయి. దీంతో ప్రతిరోజూ ధరలు మారనున్నాయి. ఏ రోజుకారోజు మారిపోయే ధరలను తెలుసుకోవడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ మొబైల్ యాప్ ఉంటే చాలు. దీని కోసం ప్లే స్టోర్ లో fuel@IOC అని టైప్ చేస్తే యాప్ కన్పిస్తోంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆన్ లైన్ కాకుండా ఆఫ్ లైన్ లో కూడ ఎస్ఎంఎస్ ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

RSP అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి డీలర్ కోడ్ టైప్ చేసి 9224992249 నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలని ఐఓసీ ప్రకటించింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hurdles have been cleared for switching over to daily fuel price revisions across the country from Friday. Transport fuel rates will be changed in line with global rates as petroleum dealers have withdrawn their call for closure of vends. The government agreed to their demand that the price announcement would be daily made at 6 a.m. instead of midnight. Petroleum Minister Dharmendra Pradhan told reporters here on Wednesday
Please Wait while comments are loading...