నీడ పడిందని దళిత యువతిని చావబాదారు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గణేష్‌పూర్ అనే గ్రామంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. తన నీడ అగ్ర కులస్తుడిపై పడిందని ఓ దళిత బాలికను అగ్రకులస్తులు తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జూన్ 13న చోటు చేసుకుంది. అదే రోజున బాధితులు గడిమల్హేరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి తండ్రి చేసిన ఫిర్యాదు ప్రకారం.. అతని కూతురు మంచినీళ్ల కోసం చేతి పంపు వద్దకు వెళ్లి నీరు తెచ్చుకుంటోంది.
అదే సమయంలో అక్కడే వున్న అగ్ర కులస్తుడైన పురణ్ యాదవ్ అనే వ్యక్తిపై ఆమె నీడ పడింది. దీంతో ఆగ్రహానికి గురైన అతడు, అతని కుటుంబంలోని మహిళలు బాధితురాలిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.

అంతేగాక, మరోసారి చేతి పంపు వద్దకు వస్తే చంపేస్తామని ఆ బాలికను బెదిరింపులకు గురిచేశారు. కాగా, తీవ్రంగా గాయపిన బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆమె కుటుంబసభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ కేసును ఏఎస్పీ నీరజ్ పాండే పర్యవేక్షిస్తున్నారు. ఓ వైపు అభివృద్ధి దిశగా పయనిస్తున్నప్పటికీ కులం పేరుతో దేశంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం విచారకరం.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications