పెళ్లికి నిరాకరించిందని యువతికి నిప్పంటించాడు
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. తనతో పెళ్లికి నిరాకరించిందిన ఓ దళిత యువతికి నిప్పంటించాడో దుర్మార్గుడు. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందింది.
కల్లార్పూర్‌లోని ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతున్న బాధిత యువతి మృతి చెందిందని బుధవారం పోలీసులు మీడియాకు తెలిపారు.

దినేష్ అనే యువకుడు తనను ప్రేమించడం లేదని, తనతో పెళ్లికి ఒప్పుకోవడం లేదనే కోపంతో బాధిత యువతికి నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.
జూన్ 29న నిందితుడు దినేష్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెప్పారు. హత్యా నేరం కింద నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications