డ్యాన్స్ బార్లకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: డ్యాన్స్ బార్ల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందికాదని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లు నిర్వహించుకోవచ్చని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లు తెరిపించడానికి రంగం సిద్దం అయ్యింది.
2005లో మొదటి సారి మహారాష్ట్ర ప్రభుత్వం డ్యాన్స్ బార్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తరువాత ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. 2013లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నిసుప్రీం కోర్టు కొట్టేసింది.
తరువాత మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం మళ్లీ డ్యాన్స్ బార్లపై నిషేధం విధించింది. మళ్లి ఇండియన్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. డ్యాన్స్ బార్లు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని మనవి చేశారు.

మహారాష్ట్ర ప్రభుత్వం కేవలం వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోవడానికి సుప్రీం కోర్టు తీర్పును పక్కన పెట్టిందని, కొందరు రాజకీయ నాయకులు వారి సొంత పరువు కోసం ఈ విషయాన్ని పెద్దది చేస్తున్నారని పిటీషన్‌లో పేర్కోంది. సుప్రీం కోర్టు డ్యాన్స్ బార్ల మీద ఉన్న నిషేదం పై స్టే విధించింది.












Click it and Unblock the Notifications