వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాకిస్తాన్ లో తొలిసారి ఓ హిందువుకు..

పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ శుక్రవారం తన మంత్రిమండలిని ఏర్పాటుచేశారు. తొలిసారి ఓ హిందువుకు పాకిస్తాన్ మంత్రిమండలిలో అవకాశం కల్పించారు. గడిచిన 20 ఏళ్లలో ఓ హిందువు పాకిస్తాన్ కేబి

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్తాన్ నూతన ప్రధానమంత్రి షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ శుక్రవారం తన మంత్రిమండలిని ఏర్పాటుచేశారు. ఇటీవల ప్రధాని పదవి నుంచి దిగిపోయిన నవాజ్‌ షరీఫ్‌ అనుచరులు, మిత్రపక్షాలకు తన కేబినెట్‌లో పెద్దపీట చేశారు.

అలాగే తొలిసారి ఓ హిందువుకు పాకిస్తాన్ మంత్రిమండలిలో అవకాశం కల్పించారు. గడిచిన 20 ఏళ్లలో ఓ హిందువు పాకిస్తాన్ కేబినెట్‌లో చోటు దొరకడం ఇదే తొలిసారి.

Darshan Lal becomes first Hindu to enter Pakistan cabinet in 20 years

పాకిస్తాన్ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ శుక్రవారం 47 మంది కేబినెట్‌ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇందులో 28 మంది ఫెడరల్‌ మంత్రులు, 19 మంది సహాయమంత్రులు ఉన్నారు.

హిందువు అయిన దర్శన్‌ లాల్‌(65) కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. పాకిస్తాన్ లోని నాలుగు ప్రావిన్సులను సమన్వయం చేసే బాధ్యతను ఆయన తీసుకుంటారని పాక్‌ వర్గాలు తెలిపాయి.

దర్శన్‌ లాల్‌ సింధ్‌ ప్రావిన్స్‌ ఘోట్కి జిల్లాలోని మీర్‌పూర్‌ మథెలో పట్టణానికి చెందిన వారు. వృత్తిరీత్య డాక్టర్‌ అయిన ఆయన 2013లో పాక్‌ పార్లమెంటుకు పీఎంఎల్‌-ఎన్‌ టికెట్‌పై వరుసగా రెండోసారి గెలుపొందారు.

మైనారిటీలకు రిజర్వు చేసిన సీటు నుంచి ఆయన పాక్‌ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో అడుగుపెట్టారు. 2018లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పీఎంఎల్‌-ఎన్‌ విజయమే లక్ష్యంగా తన కేబినెట్‌ను ప్రధాని షాహిద్‌ ఖాన్‌ అబ్బాసీ ఏర్పాటు చేసుకున్నారు.

English summary
Pakistan’s new Prime Minister Shahid Khaqan Abbasi formed his cabinet on Friday, which comprised his forerunner Nawaz Sharif’s advisers and allies. This new cabinet also carved its way in the history books of the Pakistan’s government as it included its first Hindu member in almost two decades, Darshan Lal. President Mamnoon Hussain administered the oath taking ceremony of office to the 47-member cabinet comprising of 28 federal and 19 state ministers in a televised event at his official residence. Ahead of the general elections in mid-2018, the ‘reshuffle’ was aimed at bolstering support for the ruling Pakistan Muslim League-Nawaz (PML-N).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X