దసరా గజేంద్ర దాడిలో మావటి, ఏనుగు శ్రీరామ మృతి

బెంగళూరు: మదపుటేనుగు దాడిలో మావటి, సాటి ఏనుగు మరణించిన సంఘటన చామరాజనగర జిల్లాలో జరిగింది. చామరాజ నగర జిల్లా బిళిగిరి రంగనబెట్ట (బిళిగిరి రంగన కోండ) సమీపంలో సంరక్షిత అటవీ ప్రాంతంలో ఏనుగుల శిబిరం ఉంది.

మైసూరు దసరా ఉత్సవాలలో పాల్గొనే గజేంద్ర, శ్రీరామ అనే రెండు ఏనుగులు ఇదే శిబిరంలో ఉన్నాయి. ఆదివారం సాయంత్రం గజేంద్ర, శ్రీరామ అనే ఏనుగులకు మదం పట్టడంతో గట్టిగా ఘీంకరించాయి. ఆ సమయంలో చాల సేపు మావటి గణపతి (45) ఏనుగులను అదుపులోకి తీసుకు రావడానికి విఫలయత్నం చేశాడు. తరువాత ఆహారం వేస్తే సరిపోతుందని భావించాడు.

ఆహారం తీసుకుని గజేంద్ర దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో మదపుటేనుగు గజేంద్ర తొండంతో దాడి చెయ్యడంతో గణపతికి తీవ్రగాయాలైనాయి. తరువాత గజేంద్ర తన దంతాలతో సాటి ఏనుగు శ్రీరామను పోడిచింది. గాయాలైన మావటి గణపతిని వెంటనే చామరాజనగర జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అతను మరణించాడు.

dasara elephant gajendra kills kavadi and elephant

శ్రీరామ మృతి.............!

దంతాలు దాడిలో గాయాలైన శ్రీరామ (31) అనే ఏనుగు ఆదివారం రాత్రి మరణించింది. అటవీ శాఖ అధికారులు మత్తు మందు ఇచ్చి మదం పట్టిన గజేంద్రను అదుపులోకి తీసుకు వచ్చారు. సోమవారం ఉదయం గజేంద్రకు మళ్లి మదం పట్టింది.

దసరా ఉత్సవాలలో గజేంద్ర.............!

60 సంవత్సాల వయస్సు ఉన్న గజేంద్ర గత 17 సంవత్సరాల నుండి మైసూరు దసచా ఉత్సవాలలో పాల్గోంటున్నది. మైసూరు నగరంలోని పలు వీదులలో సంచరించి అందరిని ఆకట్టుకునేది. 1987లో కోడుగు జిల్లా కట్టిపుర అటవి ప్రాంతం నుండి ఈ ఏనుగును పట్టుకుని వచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+