మఠంలో స్వామిజీ రొమాన్స్, 20 ఏళ్ల అమ్మాయితో ఎస్కేప్, తిరుమలలో పెళ్లి ?, ఎంతపని చేశావురా దేవుడా !

బెంగళూరు/ కోలారు: మఠంలో స్వామిజీకి పాద పూజ చెయ్యడానికి వెళ్లిన 20 ఏళ్ల యువతిని అదే స్వామిజీ లేపుకుపోయాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మఠంలో స్వామిజీ రొమాన్స్ చేస్తున్నాడని వెలుగు చూడటంతో భక్తులు హడలిపోయారు. మఠంలో పూజలు చేసి దేవుడిని ప్రార్థించడానికి వెళ్లిన అమ్మాయితో స్వామిజీ పరారైనాడని జోరుగా ప్రచారం జరగడంతో ఆ మఠంలోని భక్తులు షాక్ కు గురైనారు. తిరుమలలో తాను యువతిని వివాహం చేసుకున్నానని, త్వరలో మఠంకు వస్తానని స్వామిజీ సమాచారం ఇచ్చారని మాయం అయిన అమ్మాయి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

భక్తులకు స్వామిజీ హామీ

భక్తులకు స్వామిజీ హామీ

ఆంధ్రప్రదేశ్- కర్ణాటక సరిహద్దులోని కోలారు తాలుకాలోని హోళలి గ్రామం సమీపంలో భీమలింగేశ్వర సేవాశ్రయం ఉంది. కర్ణాటకలోని బాగల్ కోటేలోని ముధోళకు చెందిన దత్తాత్రేయ అవధూత స్వామిజీ కొంత కాలం క్రితం ఈ ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమాన్ని అన్ని విదాలుగా తాను అభివృద్ది చేస్తానని స్థానికులను దత్తాత్రేయ ఆవధూత స్వామిజీ నమ్మించాడు.

స్వామిజీ ఆశ్రమాన్ని ఉద్దరిస్తాడని !

స్వామిజీ ఆశ్రమాన్ని ఉద్దరిస్తాడని !

బాగల్ కోటే నుంచి వచ్చిన దత్తాత్రేయ ఆవధూత స్వామిజీ మా గ్రామంతో పాటు ఇక్కడి ఆశ్రమాన్ని ఉద్దరిస్తాడని అక్కడి ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఇంత కాలం స్వామిజీకి పూజలు పునస్కారాలు చేశారు. కొంత కాలం క్రితం ఆశ్రమానికి వెళ్లిన దత్తాత్రేయ ఆవధూత స్వామిజీ ప్రతినిత్యం ఆశ్రమంలో పూజలు చేస్తూ స్థానికులను ఎంతో నమ్మించాడని సమాచారం.

శివరాత్రి రోజు 20 ఏళ్ల అమ్మాయి !

శివరాత్రి రోజు 20 ఏళ్ల అమ్మాయి !

కోలారు తాలుకా హోగళి గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి శివరాత్రి రోజు ఆశ్రమంలో స్వామిజీకి పాదపూజ చేసి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. తరువాత ఆశ్రమానికి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాలేదు. శివరాత్రి రోజు ఆశ్రమంలో భక్తులతో పాటు మా అమ్మాయి జాగరం చేసి అక్కడే ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

యువతితో స్వామిజీ ఎస్కేప్

యువతితో స్వామిజీ ఎస్కేప్

మఠానికి వెళ్లిన 20 ఏళ్ల యువతితో దత్తాత్రేయ ఆవధూత స్వామిజీ మాయం అయ్యాడని వెలుగు చూడటంతో అమ్మాయి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు, మఠం భక్తులు షాక్ కు గురైనారు. స్వామిజీకి పాదపూజ చెయ్యడానికి అప్పుడప్పుడు ఆ యువతి మఠానికి వెళ్లి వస్తోందని, శివరాత్రి రోజు వెళ్లిన తరువాత ఆమె మాయం అయ్యిందని కుటుంబ సభ్యులు కోలారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Recommended Video

    Kambala Jockey Srinivasa Gowda Running Video | Oneindia Telugu
    తిరుపతిలో ఉన్నాం, డోంట్ వర్రీ ఫ్రెండ్స్

    తిరుపతిలో ఉన్నాం, డోంట్ వర్రీ ఫ్రెండ్స్

    స్వామిజీతో పాటు పారిపోయిన యువతి సోదరుడు అదే మఠంలో పని చేస్తున్నాడు. యువతి సోదరుడికి, ఆయన స్నేహితులకు ఫోన్ చేసిన స్వామిజీ తాము తిరుమలలో పెళ్లి చేసుకున్నామని, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నామని, రెండు మూడు రోజుల్లో తిరిగి మఠానికి వస్తామని సమాచారం ఇచ్చాడని తెలిసింది. స్వామిజీ యువతిని వివాహం చేసుకున్నాడని తెలుసుకున్న మఠం భక్తులు, స్థానికులు షాక్ కు గురైనారు. మాయం అయిన అమ్మాయి, స్వామిజీ ఆచూకి తెలుసుకోవడానికి స్వయంగా కోలారు జిల్లా ఎస్పీ రంగంలోకి దిగి ప్రత్యేక పోలీసు టీంలు ఏర్పాటు చేసి వారి కోసం గాలిస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+