Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Daughter: కూతురు, కడుపులో బిడ్డ ప్రాణం పోయింది, అల్లుడి ఇంటి ముందు ఆత్మహత్య చేసుకున్న మామ !

బెంగళూరు/హాసన్: యువకుడు బుద్దిమంతుడు అని కొందరు చెప్పడంతో వెనుకా ముందు ఆలోచించకుండా అమ్మాయి కుటుంబ సభ్యులు అతనితో కూతురి వివాహం జరిపించారు. వివాహం చేసుసుకున్న అల్లుడికి కట్నం కింద బంగారు నగలు, నగదు ఇచ్చారు. వివాహం చేసుకుని భర్తతో కాపురం చేసిన భార్య గర్బవతి అయ్యింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్తతో పాటు అత్తమామలు టార్చర్ పెట్టి ఆమెను ఇంటి నుంచి పుట్టింటికి తరిమేశారు. పుట్టింటికి వెళ్లిన మహిళ కడుపులోని బిడ్డ చనిపోయింది. మూడు రోజులకు ఆమె కూడా చనిపోయింది. పెద్దలు పంచాయితీలు చేసి వివాహం చేసుకునే సమయంలో మహిళ కుటుంబ సభ్యులు ఇచ్చిన బంగారు నగలు, నగదు తిరిగి ఇచ్చేయాలని, ఆమె కుటుంబ సభ్యులు కేసు పెట్టకూడదని తీర్మానం చేశారు. కూతురు తిథి చెయ్యడానికి వెళ్లిన ఆమె తండ్రి అల్లుడి ఇంటి ముందు గుమ్మానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కూతురి చావుకు కారణం అయిన తన అల్లుడు, అతని తల్లిదండ్రులు తన ఆత్మహత్యకు కారణం అయ్యారని, వీరిని బతికున్నంత వరకు అందర్నీ జైల్లో పెట్టాలని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన మామ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.

 20 నెలల క్రితం పెళ్లి చేశారు

20 నెలల క్రితం పెళ్లి చేశారు

కర్ణాటకలోని హాసన్ జిల్లాలోని బేలూరు తాలుకాలోని మూళగెరె గ్రామంలో నివాసం ఉంటున్న హేమాశ్రీ అనే యువతికి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధాలు చూశారు. ప్రవీణ్ అనే యువకుడు బుద్దిమంతుడు అని కొందరు హేమాశ్రీ తండ్రి నాగరాజు (55)కు చెప్పడంతో వెనుకా ముందు ఆలోచించకుండా అతని కుటుంబ సభ్యులు ప్రవీణ్ తో హేమాశ్రీ వివాహం జరిపించారు.

 కూతురు తల్లి అయ్యింది

కూతురు తల్లి అయ్యింది

హేమాశ్రీని వివాహం చేసుసుకున్న అల్లుడు ప్రవీణ్ కు ఆమె కుటుంబ సభ్యులు కట్నం కింద బంగారు నగలు, నగదు ఇచ్చారు. వివాహం చేసుకుని భర్త ప్రవీణ్ తో కాపురం చేసిన హేమాశ్రీ గర్బవతి అయ్యింది. అదనపు కట్నం తీసుకురావాలని భర్త ప్రవీణ్ తో పాటు అత్తమామలు భద్రమ్మా, సోమన్న ఆమెను టార్చర్ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి.

 తల్లి, బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి

తల్లి, బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి

హేమాశ్రీని కట్నం తీసుకురావడానికి నిరాకరించడంతో భర్త ప్రవీణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఆమెకు నరకం చూపించి ఇంటి నుంచి బయటకు పంపించేసి పుట్టింటికి తరిమేశారని తెలిసింది. పుట్టింటికి వెళ్లిన కొన్ని రోజులకే హేమాశ్రీ కడుపులోని బిడ్డ చనిపోయింది. అక్టోబర్ 30వ తేదీన హేమాశ్రీ కూడా కూడా చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోయారు.

 పెద్దలు పంచాయితీలు చేసి రాజీ చేశారు

పెద్దలు పంచాయితీలు చేసి రాజీ చేశారు

హేమాశ్రీతో పాటు ఆమె కడుపులో బిడ్డ చనిపోవడంతో ఆమె తండ్రి నాగరాజు పోలీసు కేసు పెట్టడానికి సిద్దం అయ్యాడు. ఆ సమయంలో గ్రామంలోని కొందరు పెద్దలు హేమాశ్రీని పెళ్లి చేసుకునే సమయంలో ప్రవీణ్ తీసుకున్న కట్నం డబ్బులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన బంగారు నగలు తిరిగి ఇచ్చేయాలని చెప్పారు.

 డెడ్ లైన్ పెట్టిన గ్రామస్తులు

డెడ్ లైన్ పెట్టిన గ్రామస్తులు

హేమాశ్రీ తిథి (దినాల రోజు) కచ్చితంగా బంగారు నగలు, నగదు ఇచ్చేయాలని గ్రామ పెద్దలు ప్రవీణ్ కు తేల్చి చెప్పారు. బంగారు నగలు, నగదు తిరిగి ఇవ్వడానికి ప్రవీణ్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. నాగరాజు కూడా చనిపోయిన కూతురు హేమాశ్రీ తిరిగిరాదని అనుకుని పోలీసు కేసు పెట్టకుండా వెనక్కి తగ్గాడు.

 ఇంటికి తాళం వేసుకుని పరారైన అల్లుడు

ఇంటికి తాళం వేసుకుని పరారైన అల్లుడు

గురువారం హేమాశ్రీ తిథి చెయ్యాలని ముందుగానే నిర్ణయించారు. గురువారం తిథికి కావలసిన వస్తువులు తీసుకున్న నాగరాజ్ అతని కూతురు దినాలు చెయ్యడానికి అల్లుడు ప్రవీణ్ ఇంటి దగ్గరకు వెళ్లాడు. మామ నాగరాజ్ కచ్చితంగా వస్తాడని తెలుసుకున్న ప్రవీణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని పరారైనారు.

 అల్లుడి ఇంటి ముందు మామ ఆత్మహత్య

అల్లుడి ఇంటి ముందు మామ ఆత్మహత్య

ఉదయం నుంచి రాత్రి వరకు అల్లుడు ప్రవీణ్ ఇంటి ముందే వేచి చూసిన నాగరాజు కూతురు తిథి చెయ్యలేకపోయానని ఆవేదనతో అల్లుడి ఇంటి ముందు గుమ్మానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తన కూతురు హేమాశ్రీ చావుకు కారణం అయిన తన అల్లుడు ప్రవీణ్, అతని తల్లిదండ్రులు భద్రమ్మ, సోమన్న తన ఆత్మహత్యకు కారణం అయ్యారని, వీరిని బతికున్నంత వరకు ముగ్గురిని జైల్లో పెట్టాలని, మాలాంటి చావు ఎవ్వరికి రాకూడదని మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన మామ నాగరాజు అల్లుడి ఇంటి ముందు గుమ్మానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ప్రవీణ్ అతని భార్యహేమాశ్రీని వివాహం జరిగినప్పటి నుంచి టార్చర్ పెడుతున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హేమాశ్రీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఊరి పెద్దలు కొందరు ఇంతకు ముందే రాజీ చేసి దంపతులు సంతోషంగా సంసారం చెయ్యడానికి ప్రయత్నించారని తెలిసింది. తన కొడుకు ప్రవీణ్ కోడలు హేమాశ్రీని టార్చర్ పెడుతున్నారని తెలిసినా ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపణలు ఉన్నాయి. కోడలిని ఎక్కువ చిత్రహింసలు పెడతే ఆమె పుట్టింటి నుంచి ఇంకా కట్నం డబ్బులు, బంగారు నగలు తీసుకువస్తుందని ప్రవీణ్ తల్లిదండ్రులు కూడా ఆమెను టార్చర్ పెట్టారని ఆరోపణలు ఉన్నాయి. కనీసం హేమాశ్రీ తిథి చెయ్యడానికి కూడా ఆమె భర్త ప్రవీణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడంతో ఆవేదనతో నాగరాజు వారి ఇంటి ముందే ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+