కసాయి కూతురు.. ఆస్తి కోసం కన్నతల్లిపై కర్కశత్వం.. వీడియో వైరల్

Viral News: నవమాసాలు కనిపెంచిన తల్లిపట్ల కర్కశత్వాన్ని ప్రదర్శించింది ఓ కసాయి కూతురు. ఆస్తి తన పేరు మీద రాయాలని కన్నతల్లిని నరకయాతనకు గురి చేసింది. చెంపల మీద గట్టిగా కొట్టింది.. పళ్లతో కొరికింది.. జుట్టు లాగింది.. ఇష్టం వచ్చినట్లు దాడి చేసి.. తనలోని వికృత రూపాన్ని బయటపెట్టింది. ఇక ఆ తల్లిని కూతురు చిత్రహింసలు పెడుతున్న ఘటనకు సంబంధించి వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ కూతురిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

హర్యానాలోని హిసార్ లో జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించి వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీదకు మార్చుకునేందుకు ఆ కూతురు దారుణ హింసలకు గురిచేసింది. 3 నిమిషాలు ఉన్న ఆ వీడియోలో తన తల్లిపై ఆ కూతురు చాలా కర్కశత్వంగా ప్రవర్తించింది. జన్మనిచ్చిన తల్లిని కొడుతూ, తన్నుతూ, కొరుకుతూ తనలో ఉన్న రాక్షసత్వాన్ని బయటపెట్టింది. కూతురు చేష్టలకు తల్లి ఏమీ చేయలేకపోయింది.

Daughter s Brutal Abuse of Mother Over Property Dispute Goes Viral Shocking Video from Haryana

కొన్ని సార్లు చెంప మీద కొడుతూ.. తల్లి తొడను కొరికి, ఆమెను నేలకేసి కొట్టి.. జుట్టు పట్టుకుని అటు ఇటూ ఊపుతూ .. "నువ్వు నా చేతుల్లో చస్తావు.. నీ రక్తం తాగుతా.."అంటూ ఇష్టం వచ్చినట్లు చితకబాదింది. ఆ కన్న తల్లి దండం పెట్టినా వెనక్కి తగ్గలేదు. ఈ వ్యవహారం మొత్తానని బాధితురాలి కొడుకు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తల్లిని బందీగా ఉంచి ఆమె ఆస్తిని తన పేరు మీదకు బదిలీ చేయమని.. తన సోదరి మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలు పెడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హర్యానాలో హిసార్ జిల్లా ఆజాద్ నగర్‌లోని మోడరన్ సాకేత్ కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితురాలిని రీటాగా గుర్తించారు. ఆమె తన తల్లి నిర్మలాదేవిని హింసించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. రీటాకు రెండేళ్ల క్రితం రాజ్ గఢ్ సమీపంలోని గ్రామంలో నివసించే సంజయ్ పూనియాతో వివాహమైంది. తన భర్తకు ఎలాంటి సంపాదన లేకపోవడంతో కొంతకాలం తర్వాత రీటా తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. దీని తర్వాత ఆమె తన తల్లిని ఆస్తి కోసం వేధించడం ప్రారంభించింది. తన భర్తను కూడా ఇక్కడకు వచ్చేయమని కోరింది.

రీటా కురుక్షేత్రలోని తన కుటుంబానికి చెందిన పలు ఆస్తులను అమ్మేసి ఇప్పటికే దాదాపు రూ. 65 లక్షలను తన దగ్గర ఉంచుకుంది. ఇప్పుడు తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిని తన పేరు మీద రాయాలని తల్లిని దారుణంగా హింసించింది. బాధితురాలి కొడుకు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. రీటాపై ఇండియన్ జస్టిస్ కోడ్, తల్లిదండ్రులు,సీనియర్ సిటిజన్ల నిర్వహణ సంక్షేమ చట్టం,2007 కింద కేసు నమోదు చేసినట్లు ఆజాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇన్సెక్టర్ సాధురామ్ వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+