Onion Price:మంట పుట్టిస్తున్న ఉల్లిపాయలు
Onion Price: టమాటా తర్వాత ఉల్లిపాయ కూడా ధరల పెరుగుదల జాబితాలో చేరింది. గత నాలుగు రోజుల్లో 25 శాతం పెరిగింది. కిలో రూ.15గా ఉన్న ఉల్లిపాయలు రూ.25కు చేరాయి. నాలుగు రోజుల వ్యవధిలో 10 రూపాయలు పెరిగింది. హోల్ సేల్ ధర అయితే ఏకంగా 25 శాతం పెరిగింది. దేశం మొత్తానికి అతి పెద్ద ఉల్లి మార్కెట్ అయిన లాసల్ గావ్ లో క్వింటా రూ.1300కు చేరుకుంది. ఈ పరిస్థితులను విశ్లేషిస్తున్న వ్యాపారులు రానున్న రోజుల్లో మరింత పెరగనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
నాసిక్ మండిలో జూన్ 27న ఉల్లి సగటు ధర క్వింటాల్‌కు రూ.1201గా ఉంది. తర్వాత ఒక్కరోజే రూ.79 పెరుగుదల నమోదైంది. జూన్ 28న ఉల్లి ధర క్వింటాల్‌కు 1280కి పెరిగింది. జూన్ 29న ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.1280 నుంచి రూ.1300కు పెరగడంతో మామిడిపండ్ల ధరలు తగ్గాయి. ఉల్లి, టమాటా, పచ్చికూరగాయల ధరలు ఇలాగే రోజు రోజుకు పెరుగుతుంటే పప్పులే దిక్కని ప్రజలు వాపోతున్నారు.

ఈ ఏడాది హారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో ఉల్లిపాయలు బాగా పండాయి. ఫిబ్రవరి నెలలో ధరలు బాగా పడిపోవడంతో పెట్టిన ఖర్చును కూడా అన్నదాతలు పొందలేకపోయారు. మండిలో కిలో ఉల్లి రూ.1 నుంచి 2కు అమ్ముడు పోయింది. దీంతో రైతులంతా ఉల్లిపాయల్ని రోడ్డుపక్కన పడేశారు. తాజాగా ధరలు పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆసియా ఖండంలోనే ఉల్లిపాయలకు అతి పెద్ద మార్కెట్ లాసల్ గావ్. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉంది. ఇక్కడి మార్కెట్ ధరను బట్టి మనదేశంలో ఉల్లిపాయల ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిసా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బీహార్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉల్లిని ఎక్కువగా పండిస్తుంటాయి.












Click it and Unblock the Notifications