మీ భూముల ధరలు కోట్లలో ఉంది, బెంగళూరు వాళ్లకు మాయగాళ్లు, డీసీఎం vs మాజీ సీఎం ఢిష్యూమ్

బెంగళూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి సొంత నియోజజక వర్గం అయిన కనకపురనును బెంగళూరులో కలుపుతామని డీసీఎం డీకే శివకుమార్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి డీకే శివకుమార్ పై విరుచుకుపడ్డారు.

కనకపుర నియోజక వర్గం రామనగర జిల్లాలో భాగంగానే ఉండాలా? లేక రాజధానిని బెంగళూరులో విలీనం చేయాలా? అదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది..దీనిపై బహిరంగ ప్రకటన చేసిన డీకే శివకుమార్ భవిష్యత్తులో బెంగళూరులో కనక్పుర భాగం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కనకపుర పరిసరాల్లో జరుగుతున్న అక్రమాలను క్రమబద్ధీకరించేందుకు డీకే శివకుమార్ ప్రయత్నిస్తున్నారని మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు.

DCM DK Shivakumar made sensational comments that Kanakapura will be merged with Bengaluru

డీకే శివకుమార్ అక్రమాస్తులు విలువ పెంచుకోవడానికి ఇలా చేస్తున్నారని మాజీ సీఎం కుమారస్వామి తీవ్రస్థాయిలో ఆరోపణ చేశారు. ఏరియాలోని ఆస్తుల యాజమాన్యం, బినామీ లావాదేవీలు, అక్రమ ఆక్రమాస్తులపై డీకే శివకుమార్ ను మాజీ సీఎం కుమారస్వామి ప్రశ్నించారు. రామనగర జిల్లా నుంచి కనకపుర తాలూకాను విడదీసి బెంగళూరులో కలపాలన్న డీకే శివకుమార్ ప్రతిపాదనను కుమారస్వామి తీవ్రంగా ఖండించారు.

గతంలో కనకపుర తాలుకా బెంగళూరు జిల్లాకు చెందినది. తరువాత కనకపుర రామనగర జిల్లాలో భాగం అయ్యిందని డీకే శివకుమార్ అంటున్నారు. అయితే ఇంతకాలం తరువాత రామనగర జిల్లాకు డీకే శివకుమార్ తీరని ద్రోహం చేశారని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. కనకపుర సమీపంలోని శివనహళ్లి ఆలయ పునరుద్ధరణ కార్యక్రమంలో మాట్లాడిన డీకే శివకుమార్ బెంగుళూరు ప్రజలకు భూములు అమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీరు రామనగర జిల్లాకు చెందిన వారు కాదు. మీరు బెంగళూరు గ్రామీణ జిల్లా నుంచి విడిపోయారని గుర్తుంచుకోండి, మీ ఆస్తులను బెంగళూరువాసులకు అమ్మవద్దని శివనహళ్లి ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు మీ జేబుల్లో డబ్బు పెట్టలేను, మీకు పెద్దపెద్ద ఇండ్లు కట్టివ్వలేను, కానీ మీఆస్తుల విలువ పదిరెట్లు పెంచే శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు, మీరు నన్ను ఆశీర్వదించండి అంటూ డీసీఎం డీకే శివకుమార్ స్థానిక ప్రజలకు బహిరంగంగా చెప్పారు.

DCM DK Shivakumar made sensational comments that Kanakapura will be merged with Bengaluru

డీకే శివకుమార్ ప్రకటనపై విమర్శలు గుప్పించిన మాజీ సీఎం కుమారస్వామి, కనకపుర పరిసరాల్లో ఆస్తుల విలువ పెంచేందుకు డీకే శివకుమార్ తన వ్యక్తిగత ఖజానాను నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీనిపై డీకే శివకుమార్ స్పందిస్తూ నా ప్రతిపాదన చట్టబద్ధమైనదే అని చెప్పారు. మాజీ సీఎం కుమారస్వామి చేస్తున్న ఆరోపణలు నా పేరును దిగజారచే విదంగా ఉన్నాయని మండిపడ్డారు.

ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం ప్రజాక్షేత్రంలో అనుకూల వ్యతిరేక చర్చకు దారితీసింది. బెంగుళూరు నుండి 55 కి.మీ దూరంలో ఉన్న కనకపుర ప్రస్తుతం రామనగర జిల్లా పరిధిలోకి వస్తుంది. 2007కి ముందు కనకపుర బెంగళూరు రూరల్ జిల్లా పరిధిలో ఉండేది. అయితే రామనగర జిల్లా ఏర్పాటు అయిన తరువాత బెంగళూరు గ్రామీణ జిల్లాలోని కనకపుర తాలుకా రామనగరలో కలిసిపోయింది. రామనగర జిల్లాను ఏర్పాటు చేసింది మాజీ సీఎం కుమారస్వామి అనే విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+