మధ్యాహ్న భోజనంలో మూషికం... విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎలుక చచ్చిన మధ్యాహ్న భోజనం తిని తొమ్మిది మంది పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
న్యూఢిల్లీ: సాక్షాత్తు దేశ రాజధాని నగరమైన దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వడ్డించిన మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక వచ్చింది. తెలియక ఆ ఆహారం తిన్న తొమ్మిదిమంది పాఠశాల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
డియోలి ప్రాంతంలోని ప్రభుత్వ బాలుర సీనియర్ సెకండరీ స్కూలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మధ్యాహ్న భోజనంలో చచ్చిన ఎలుక వచ్చిందని, ఆ భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని తెలిసి తాము మదన్ మోహన్ మాలవ్య ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో మాట్లాడానని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు.
ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, ఎలుక ఉన్న ఆహారం సరఫరా చేసిన వారిపై కేసు పెట్టడంతోపాటు వారిని బ్లాక్ లిస్టులో పెట్టామని, ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించామని ఆయన ఆ ట్వీట్ లో వివరించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications