ఐటీ చెల్లించని వారికి శుభవార్త: రిటర్న్స్ దాఖలు గడువు పొడిగింపు

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ దాఖలు చేయని వారికి శుభవార్త. ఆడిట్ రిపోర్ట్, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడిగించింది సీబీడీటీ. ఈ మేరకు ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) సోమవారం ప్రకటన చేసింది.

ఐటీ రిటర్న్‌ దాఖలు చేసేందుకు ఇచ్చిన గడువును 31 అక్టోబరు 2018 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కొన్ని ప్రత్యేక విభాగాలకు చెందిన పన్ను చెల్లింపుదారులకు ఈ అవకాశం వర్తిస్తుందని తన ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఆడిట్‌ రిపోర్టు పరిశీలన తుది గడువును కూడా అక్టోబరు 31 వరకు పొడిగించినట్లు ప్రకటించింది.

Deadline For Filing IT Returns & Audit Reports Extended To 31st Oct

ఐటీ రిటర్న్‌ దాఖలు గడువును పెంచడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 2017-18(అసెస్మెంట్ ఇయర్ 2018-19)కి గాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి మొదట ఆగస్ట్ 31 వరకు పొడిగించారు.

ఆ తర్వాత మరోసారి తేదీని పొడిగించి సెప్టెంబరు 30కి పొడిగించారు. ఆ తర్వాత ఆ తేదీని అక్టోబరు 15 వరకు పొడిగించిన సీబీడీటీ, తాజాగా మరోసారి పదిహేను రోజులు పెంచింది. అక్టోబరు 31 వరకు గడువు ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+