చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కళైంజ్ఞర్ ఇకలేరు: ‘గుర్తుండిపోతారు’ అంటూ కరుణానిధిని కీర్తించిన విదేశీ మీడియా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి(94) తమిళనాడు రాజకీయాల్లోనేగాక, దేశ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేశారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన తమిళనాడు ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

కలైంజ్ఞర్ నేతలు, సిినీ ప్రముఖుల నివాళి (పిక్చర్స్)

మంగళవారం సాయంత్రం కరుణానిధి మృతి చెందారని తెలిసి తమిళనాడు శోకసంద్రంలో మునిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజలతో మమేకమైన విధానం. తమిళనాడుకే కాదు, దేశ రాజకీయాల్లోనే ఆయన లేని లోటును తీర్చలేమని ప్రముఖ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు వ్యాఖ్యానించారు.

గుర్తుంచుకుంటారు..

గుర్తుంచుకుంటారు..

తమిళ మీడియాతోపాటు జాతీయ మీడియా కూడా కరుణానిధిపై అనేక కథనాలను ప్రచురితం చేశాయి. విదేశీ మీడియా కూడా కరుణ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. భారత్‌లో రాజకీయ, సినీ రంగాలు ఉన్నన్ని రోజులు భారతీయులు ఆయన్ని గుర్తించుకుంటారని పేర్కొనడం గమనార్హం.

సినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానంసినీ-రాజకీయాల్లో చెరగని ముద్ర: ఎంజీఆర్ ఎంట్రీతో ప్రతిపక్షంలోనే!: కరుణానిధి ప్రస్థానం

బీబీసీ ఇలా..

బీబీసీ ఇలా..

‘తమిళనాడు ప్రజల ఆరాధ్యదైవం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి కన్నుమూశారు. ఆయన రాజకీయ బ్రహ్మ. తుదిశ్వాస వరకూ డీఎంకే అధినేతగా కొనసాగారు. అప్పట్లో కులవిద్వేషాలకు వ్యతిరేకంగా పోరాడారు' అని ప్రముఖ అంతర్జాతీయ పత్రిక బీబీసీ పేర్కొంది.

శకం ముగిసిందంటూ.. శ్రీలంక మీడియా ఇలా..

శకం ముగిసిందంటూ.. శ్రీలంక మీడియా ఇలా..

‘తమిళనాడు ప్రజల హీరోగా కొనసాగిన ఆరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఇకలేరు. పేదలకు ఆయన ఆరాధ్యదైవం. తమిళనాడులో ఇక ఆయన శకం ముగిసినట్లే. ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరు' అని శ్రీలంకకు చెందిన సేలన్‌ టుడే తన కథనంలో వెల్లడించింది.

ప్రశంసిస్తూ సీఎన్ఎన్

ప్రశంసిస్తూ సీఎన్ఎన్

‘14ఏళ్ల వయసులో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. 1969లో కరుణ తొలిసారిగా ముఖ్యమంత్రి అయ్యారు. డీఎంకే అధినేతగా కూడా కొనసాగారు. తమిళనాడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారు' అని సీఎన్ఎన్ వ్యాఖ్యానించింది.

 కరుణను కీర్తించిన వాషింగ్టన్ పోస్టు

కరుణను కీర్తించిన వాషింగ్టన్ పోస్టు

‘తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కన్నుమూశారు. రాజకీయ, సినీ రంగాల్లో ఆయన చెరగని ముద్ర వేశారు. తమిళ సినీరంగంలో ఆయన 1950లో ప్రవేశించారు. ఐదు దశాబ్ధాలకు పైగా రాజకీయాల్లో సేవలు చేశారు. 1969లో తొలిసారిగా ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన.. సుమారు 19సంవత్సరాలపాటు పలుమార్లు ముఖ్యమంత్రిగా కొనసాగారు. డీఎంకే పార్టీ అధినేతగా ఎన్నో సంవత్సరాలు కొనసాగారు' అని వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.

English summary
It’s the end of an era as DMK patriarch M Karunanidhi’s demise brings the curtain down on the Dravidian movement which shaped Tamil Nadu’s politics. The Dravidian icon’s death sent shock waves not just in India but also in the Indian community abroad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X