భారత్ లో బాగా తగ్గిన మరణాలు .. తాజాగా 817 మరణాలు, 45,951 కొత్త కేసులు

భారతదేశంలో కరోనా కేసులలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్నటి కంటే ఈ రోజు కరోనా కేసులు 22 శాతం పెరిగాయి. తాజాగా గత 24 గంటల్లో భారత్ 45,951 కరోనా కేసులను నమోదు చేసింది. కరోనా మహమ్మారి కారణంగా దేశంలో 817 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం తెలుస్తుంది.

Recommended Video

    COVID Third Wave : వేగంగా వ్యాప్తి, కొత్త డెల్టా-ప్లస్ వేరియంట్.. 6 To 8 Weeks : AIIMS Chief

    ఏప్రిల్ నుండి ఇప్పటివరకు నమోదైన అతితక్కువ మరణాలు 817

    ఏప్రిల్ నుండి ఇప్పటివరకు నమోదైన అతితక్కువ మరణాలు 817

    817 కొత్త మరణాలతో, ఏప్రిల్ 11 నుండి భారతదేశం అత్యల్ప మరణాలను నమోదు చేసింది. మరణాలలో తగ్గుదల కనిపిస్తుండటం కాస్త ఉపశమనాన్ని కలిగించే అంశంగా మారింది. రోజువారీ సంఖ్య వరుసగా మూడవ రోజు 1,000 కంటే తక్కువగా ఉంది. మహారాష్ట్ర లో 231 మంది ప్రాణాలు కోల్పోగా, గరిష్ట ప్రాణనష్టం సంభవించింది. తమిళనాడులో గత 24 గంటల్లో 118 మంది మరణించారు.ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, జూన్ 28 న మొదటిసారిగా ఏప్రిల్ నుండి భారతదేశం 972 రోజువారీ మరణాలను నమోదు చేసింది.

     5,37,064 కు తగ్గిన యాక్టివ్ కేసులు

    5,37,064 కు తగ్గిన యాక్టివ్ కేసులు

    దేశవ్యాప్తంగా కరోనా మరణాలు ఇప్పుడు 3,98,454 కు పెరిగింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య ఇప్పుడు 3,03,62,848 వద్ద ఉండగా, క్రియాశీల కోవిడ్ -19 కేసులు 5,37,064 కు తగ్గాయి. కోవిడ్ -19 కేసులు అత్యధికంగా నమోదైన మొదటి ఐదు రాష్ట్రాలు 13,550 కేసులతో కేరళ, 8,085 కేసులతో మహారాష్ట్ర, తమిళనాడు 4,512 కేసులు, ఆంధ్రప్రదేశ్ 3,620 కేసులు, కర్ణాటక 3,222 కేసులు నమోదయ్యాయి. రికవరీలు కూడా గణనీయంగా పెరగటం భారత్ కు బిగ్ రిలీఫ్ ఇస్తుంది.

    రికవరీ రేటు 96.92 శాతం.. వ్యాక్సినేషన్ లో స్పీడ్ పెంచిన ఇండియా

    రికవరీ రేటు 96.92 శాతం.. వ్యాక్సినేషన్ లో స్పీడ్ పెంచిన ఇండియా

    భారతదేశం యొక్క రికవరీ రేటు 96.92 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 60,729 మంది రోగులు కరోనా నుండి కోలుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా మొత్తం రికవరీలను 2,94,27,330 కు చేర్చింది. గత 24 గంటల్లో భారతదేశం మొత్తం 36,51,983 వ్యాక్సిన్ డోసులను అందించింది. ఇది మొత్తం వ్యాక్సిన్ మోతాదుల మొత్తాన్ని 33,28,54,527 కు చేర్చింది. గత 24 గంటల్లో మొత్తం 19,60,757 నమూనాలను పరీక్షించినట్టు సమాచారం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+