వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్ కే నగర్ లో పోటీ చేస్తా, జయ మేనకోడలు దీపా: శశికళకు ఝలక్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ అన్నాడీఎంకే పార్టీ చీఫ్ నెచ్చెలి శశికళకు చుక్కలు చూపిస్తున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని ఇన్ని రోజులు దీపా జయకుమార్ చెబుతున్నారు.

పన్నీర్ సెల్వం చాణుక్య ప్రదర్శన: ప్రశంసల జల్లు

జయలలిత ఆకస్మిక మరణంతో ఆమె ప్రాతీనిథ్యం వహిస్తున్న చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఖాళీ అయిన విషయం తెలిసిందే. అక్కడి నియోజక వర్గ ప్రజలు సైతం జయలలిత అసలైన వారసురాలు దీపానే అని ఇప్పటికే కచ్చితంగా చెబుతున్నారు.

Deepa has said that she will contest in R K Nagar by election if people and cadres want the same.

శశికళ ఇక్కడి నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామని ఇప్పటికే హెచ్చరించారు. అయితే ఆర్ కే నగర్ నియోజక వర్గం ప్రజల విజ్ఞప్తి మేరకు తాను అదే నియోజక వర్గం నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని దీపా తేల్చి చెప్పారు.

స్టాలిన్ సంచలన నిర్ణయం: ఆయనకు చెక్ పెట్టడానికేనా !

జయలలిత వారుసురాలిగా తాను రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేస్తానని, అమ్మ మీద పేద ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చడానికి కార్యకర్తలతో కలిసి పని చేస్తానని దీపా జయకుమార్ చెప్పారు. ఆర్ కే నగర్ ప్రజలను కలుసుకున్న తరువాత తాను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు.

ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో శశికళ నటరాజన్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోందని మీడియా ప్రశ్నించగా ఎవ్వరు పోటీ చెయ్యాలి ? ఎవ్వరిని గెలిపించుకోవాలి? అని స్థానిక ఓటర్లు నిర్ణయిస్తారని, నాలుగు గోడల మధ్య కుర్చుని నిర్ణయం తీసుకుంటే సరిపోదని దీపా పరోక్షంగా నెచ్చెలి శశికళ, ఆమె మద్దతుదారులకు చురకలు అంటించారు.

English summary
Deepa Jayakumar has said that she will contest in R K Nagar by election if people and cadres want the same. She is getting ready to announce her decision on Feb 24.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X