జయలలిత మేనకోడలు మోసం చేశారు, ప్రజల సొమ్ము స్వాహా చేసింది, మండిపడిన లాయర్ !

ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న దీపా జయకుమార్దీపా జయకుమార్ నగదు మొత్తం స్వాహా చేశారని న్యాయవాది ఆరోపణజయలలిత ఆస్తుల కోసం దీపా ఆరాటం, అమ్మ పేరు అడ్డం పెట్టుకుని రెచ్చిపోతుంది

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ప్రజలను మోసం చేస్తున్నారని, ఆమెకు డబ్బు పిచ్చిపట్టుకుందని ప్రముఖ న్యాయవాది పశుంపొన్ పాండియన్ ఆరోపించారు. సోమవారం న్యాయవాది పశుంపొన్ పాండియన్ దీపా మీద విరుచుకుపడ్డారు.

ఎంజీఆర్ అమ్మ దీపా పేరవై పార్టీని స్థాపించిన దీపా జయకుమార్ ప్రజలను నమ్మించి పార్టీలో చేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. పార్టీలో సభత్వం తీసుకోవాలని ప్రజలకు మాయమాటలు చెప్పి వారి దగ్గర భారీ మొత్తంలో దీపా జయకుమార్ నగదు వసూలు చేస్తున్నారని న్యాయవాది పశుంపొన్ పాండియన్ ఆరోపించారు.

Deepa is a cheating person, lawyer Pasumpon Pandian accused.

ఎంజీఆర్ అమ్మ దీపా పేరవైలో చేరిన వారికి ఇంత వరకూ ఐడీ కార్డులు (గుర్తింపుకార్డులు) ఇవ్వలేదని, ప్రజల దగ్గర నగదు వసూలు చేసి దీపా స్వాహా చేస్తున్నారని న్యాయవాది పశుంపొన్ పాండియన్ విమర్శించారు. జయలలిత ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని దీపా జయకుమార్ చాల ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకే తానే సాక్షం అని న్యాయవాది పశుంపొన్ పాండియన్ ఆరోపించారు. ఇలా మోసం చేస్తున్న దీపా జయకుమార్ కు ప్రజలే తగిన బుద్ది చెబుతారని, జయలలిత పేరు అడ్డం పెట్టుకుని ఆమె ఇష్టం వచ్చినట్లు ఆడుతున్నారని న్యాయవాది పశుంపొన్ పాండియన్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+