Deep Fake Videos: సోషల్ మీడియా సంస్ధలకు కేంద్రం డెడ్ లైన్-వారం రోజుల్లో తీసేయండి...
దేశంలో ప్రధాని మోడీతో పాటు పలువురు సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు తాజాగా బయటికి రావడం కలకలం రేపింది. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన కేంద్రం... సోషల్ మీడియా సంస్ధలను పిలిపించి మాట్లాడింది. అనంతరం ఇవాళ వారికి వారం రోజుల డెడ్ లైన్ ఇచ్చింది. వారం రోజుల్లో తమ ప్లాట్ ఫామ్ లలో ఉన్న డీప్ ఫేస్ వీడియోలన్నీ తొలగించాల్సిందిగా కేంద్రం ఐటీ మంత్రిత్వశాఖ సోషల్ మీడియా సంస్ధలకు ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో డీప్‌ఫేక్ వీడియోల పరంపర పెరుగుతున్న తరుణంలో ఇలాంటి వీడియోల్ని తనిఖీ చేయడానికి కేంద్రం ఓ అధికారిని నియమిస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇవాళ ప్రకటించారు. డీప్‌ఫేక్ కంటెంట్‌పై చర్య తీసుకునేలా సదరు అధికారి పనిచేస్తారని సోషల్ మీడియా కంపెనీలతో భేటీ తర్వాత కేంద్రమంత్రి తెలిపారు. ఐటీ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు వాటి వినియోగ నిబంధనలను సర్దుబాటు చేయడానికి ఏడు రోజుల సమయం ఇచ్చామని ఆయన చెప్పారు.

డీప్ ఫేక్ వీడియోల విషయంలో సోషల్ మీడియా సంస్ధలపై కేసులు దాఖలు చేయడంలో పౌరులకు ప్రభుత్వం సహకరిస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ముందుగా ఈ వీడియో షేర్ చేసిన వారిపై కేసు పెడతామని, ఆ తర్వాత వీడియో ఎక్కడి నుంచి షేర్ అయిందో తెలుసుకుని వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు అటువంటి డీప్‌ఫేక్‌లను కవర్ చేసే చట్టపరమైన నిబంధనలను, వాటి తయారీ, సర్క్యులేషన్ చేస్తే విధించే జరిమానాలపై హెచ్చరికలు జారీ చేసింది.
తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడం ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లకు చట్టపరమైన బాధ్యత అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇవాళ మరోసారి వారికి గుర్తుచేశారు. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం నిర్దేశించిన సమయంలోపు అలాంటి వీడియోలను తీసేయాలని సోషల్ మీడియా సంస్ధలకు సూచించారు.












Click it and Unblock the Notifications