మోడీని ‘హా హా’ అనిపించిన పోస్టర్ ఇదే
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఓ పోస్టర్ ఆకట్టుకుంది. ఆ పోస్టర్ సోషల్ మీడియా ద్వారా చూసిన మోడీ 'హాహా'అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఆ విషయానికొస్తే.. ప్రముఖ బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, శశికపూర్, నిరూపా రాయ్ నటించిన 'దీవార్' సినిమా పోస్టర్‌పై స్వచ్ఛ భారత్ గురించి వివరిస్తూ రాసిన డైలాగ్ వైరల్‌గా మారింది.
Haha! Borrows from cinema to make a point on cleanliness. Innovative. https://t.co/PQpX8LHo7l
— Narendra Modi (@narendramodi) April 11, 2017
ఆ సినిమాలో నటి నిరూపా రాయ్.. అమితాబ్, శశికి తల్లిగా నటించింది. ఈ కథలో కొడుకులిద్దరూ తల్లి ఎవరితో ఉండాలన్న దానిపై గొడవపడుతుంటారు. అయితే ఈ కథనే స్వచ్ఛ భారత్ సారాంశంగా మారుస్తూ.. పోస్టర్‌పై ఓ డైలాగ్ రాశారు.
ఓ పక్క తల్లి తనతోనే ఉండాలని అమితాబ్, కాదు తనతోనే ఉండాలని శశికపూర్ అంటుంటారు. కానీ నిరూపా మాత్రం 'ఎవరైతే ముందు మరుగుదొడ్డి కట్టిస్తారో వారితోనే ఉంటాను' అంటుంది. స్వచ్ఛభారత్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించడం కోసం ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఈ పోస్టర్‌ను పెట్టారు. దీనిని సాహు అనే నెటిజన్ మోడీకి ట్వీట్ చేశాడు.
కాగా, దీనిని మోడీ రీట్వీట్ చేస్తూ.. 'హా హా.. పరిశుభ్రత గురించి చెప్పడానికి సినిమా పోస్టర్‌ని ఇలా వాడుకున్నారు. వినూత్నమైన ఆలోచన' అని ఆయన పేర్కొన్నారు. కాగా, పోస్టర్‌పై నెటిజన్లు కూడా మంచి ఆలోచన అంటూ ప్రశంసిస్తున్నారు. ఆకట్టుకునేలా పోస్టర్ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.












Click it and Unblock the Notifications