కోర్టులో కేజ్రీవాల్ పిటిషన్, కేంద్రమంత్రి జైట్లీ బ్యాంకు, ఆదాయ పన్ను వివరాలివ్వాలని వినతి

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెందిన బ్యాంకు, ఆదాయపు పన్నువివరాలను బహిర్గతం చేయాలని డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో ఆయన పిటిషన్ ను దాఖలు చేశాడు.

న్యూఢిల్లీ:కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి చెందిన బ్యాంకు , ఆదాయపు పన్ను వివరాలను బహిర్గతం చేయాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. డిల్లీ హైకోర్టులో ఆయన ఈ మేరకు ఓ పిటిషన్ ను దాఖలు చేశాడు.

అరుణ్ జైట్లీ బ్యాంకు వివరాలతో పాటు ఆయన భార్య కూతురు, అల్లుడికి సంబంధించిన 1998 నుండి 2014 వరకు బ్యాంకు వివరాలన్నింటిని ఇవ్వాలని ఆయన కోరాడు.

ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధినేతగా ఉన్నప్పుడు జైట్లీ అవినీతికి పాల్పడ్డారని కేజ్రీవాల్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై ఆరోపణలు చేశారు.ఈ ఆరోపణలతో తనకు పరువు నష్టం వాటిల్లిందని జైట్లీ కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు.

 Defamation Case: Arvind Kejriwal Seeks Arun Jaitley's Bank, Tax Details In Petition

అరవింద్ కేజ్రీవాల్ తో పాటు మరో ఐదుగురు ఆప్ నేతలపై కూడ అరుణ్ జైట్లీ ఈ మేరకు పరువు నష్టం దావా వేశారు.అయితే ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలను స్వీకరించే సమయంలో తాను ఎలాంటి వ్యక్తిగత ఆర్థిక లబ్దికి పాల్పడలేదని జైట్లీ నిరూపించుకోవాలంటే ఈ డాక్యుమెంట్లు అవసరమని కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించారు.

ఈ కేసును ఢిల్లీ హైకోర్టు మార్చి 6,7 తేదిల్లో విచారించనుంది. 2013 వరకు మొత్తం 13 ఏళ్ళ ఫాటు జైట్లీ డిడిసిఎకు అధినేతగా ఉన్నారు. ఆప్ నేతలు ఉద్దేశ్యపూర్వకంగానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని జైట్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేజ్రీవాల్ పై ఆయన క్రిమినల్ పరువు నష్టం దావా వేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+