సైన్యం రాజీపడలేదు, రేపటి వరకు కూంబింగ్: పారికర్
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‌కోట్‌లో వైమానిక స్థావరంపై దాడికి యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయని కేంద్ర రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. మంగళవారం పఠాన్‌కోట్ వైమానిక స్థావరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడిపై ప్రకటన చేశారు.
భద్రత విషయంలో సైనికులు రాజీ పడలేదన్నారు. పఠాన్‌కోట్‌లో కూంబింగ్ బుధవారం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న గ్రెనేడ్లను నిర్వీర్యం చేయకుండాఅక్కడే పేల్చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

గ్రెనేడ్లు నిర్వీర్యం చేస్తూ ఇప్పటికే ఒక అధికారిని కోల్పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఉగ్రవాదులను సైనికులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అభినందించారు. ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ ఇప్పటికే విచారణ ప్రారంభించినట్లు పారికర్ తెలిపారు. ఉగ్రవాదుల వద్ద పాకిస్థాన్‌లో తయారైన ఆయుధాలు లభ్యమయ్యాయని చెప్పారు. పఠాన్‌కోట్‌లో సైనిక కార్యాచరణ ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications