Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైనికులతో దీపావళి వేడుకల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ: కేంద్ర రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. రెండురోజుల పాటు నిర్మలా సీతారామన్ అండమాన్ నికోబార్ దీవుల్లో పర్యటించనున్నారు.సైనికులతో కలిసి ఆమె దీపావళి వేడుకల్లో పాల్గొంటారని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

బుధవారం నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవుల్లోని త్రివిధ దళాల కమాండ్‌లో ఆమె పర్యటించనున్నారు. రెండు రోజుల పాటు సీతారామన్‌ అక్కడ పర్యటిస్తారు. భద్రత తదితర విషయాలపై ఆమె అక్కడి అధికారులతో చర్చలు జరపనున్నారు.

సైనికులతో కలిసి రక్షణశాఖ మంత్రి సీతారామన్‌ దీపావళి వేడుకలు జరుపుకుంటారు. దీంతో పాటు సైనికుల కుటుంబాలతో కలిసి నిర్వహించే పలు కార్యక్రమాల్లోను ఆమె పాల్గొంటారని రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.

Defence minister Nirmala Sitharaman to visit Andaman on Diwali

Recommended Video

    Diwali 2017 : Fire In Crackers Market : Plz Be Safe | Oneindia Telugu

    ఈ పర్యటనలో భాగంగా సెల్యులర్‌ జైలులో ఉన్న స్వతంత్ర జ్యోతి, కార్‌ నికోబార్‌లో ఉన్న సునామీ మెమోరియల్‌ను ఆమె సందర్శించనున్నారు. దీంతో పాటు కార్‌ నికోబార్‌ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను ఆమె సందర్శిస్తారు. అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ భారత్‌లో ఉన్న ఏకైక త్రివిధ దళాల కమాండ్‌.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+