ఘోరం: టీనేజ్ అమ్మాయిపై గ్యాంప్‌రేప్, హత్య, గోనెసంచిలో కుక్కి పడేశారు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తొమ్మిది రోజుల క్రితం కనిపించకుండా పోయిన 14 ఏళ్ల అమ్మాయి శవమై తేలింది. పాక్షికంగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మైనర్ మృతదేహాన్ని ఔటర్ ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యువతిపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక, బాలిక శవాన్ని గోనెసంచిలో కుక్కి ఓ దుకాణం సమీపంలో పడేశారని చెప్పారు.
ఈ దారుణ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ బ్రిజేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు. సదరు వ్యక్తి స్థానికంగా ఓ దుకాణంలో పనిచేసేవాడని, ఢిల్లీ నుంచి ముంబైకి పారిపోతుండగా సన్నోత్ గ్రామంలో అతడిని పట్టుకున్నట్లు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు.

నరేలా ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఫిబ్రవరి 12 నుంచి కనిపించకుండా పోయింది. ఆమె కోసం గాలించిన తల్లిదండరులు ఆచూకీ లభించకపోవడంతో మూడు రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ శనివారం నరేలాలోని ఓ దుకాణ యాజమాని నుంచి పోలీసులకు ఫోన్ రావడం, విషయం తెలియడంతో అక్కడికి వెళ్లారు.
తన షాపు సమీపంలో తీవ్ర దుర్గంధం వస్తోందని తెలపడంతో పోలీసులు వెళ్లి తనిఖీ చేయగా.. ఓ గెన్ సంచిలో పాక్షికంగా కుళ్లిన శవం బయటపడింది. అది కిడ్నాప్ నకు గురైన బాలికదేనని పోలీసులు నిర్ధారించారు.
మరోవైపు, తన దుకాణంలో పనిచేసే వ్యక్తి మూడు రోజులుగా కనిపించడం లేదని ఫోన్ చేసిన వ్యక్తి ఆధారంగా టెక్నికల్ సర్వెలైన్స్ తో ఆ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. స్నేహితుడితో కలిసి మద్యం సేవించి ఆ తర్వాత.. బాలికకు నిందితుడు ఫోన్ చేసి.. ఏదో పనివుందని పిలిచాడు. అతడి మాటలు నమ్మివచ్చిన బాలికను కిడ్నాప్ చేసి.. నిందితులిద్దరు ఒకరి తర్వాత ఒకరు లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక ధరించిన ప్యాంటుతోనే ఆమె గొంతునులిమి చంపేశారని డీసీపీ తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications