దిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం.. వారికి వర్క్ ఫ్రమ్ హోమ్..

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం నానాటికి పెరిగిపోతుంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో అక్కడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. రికార్డు స్థాయిలో వాయు కాలుష్యం నమోదువుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టినా వాయు కాలుష్యం మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దిల్లీలో ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయిలో అంటే 359 గా రికార్డు అయింది. దీంతో దిల్లీ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరింది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పరిస్థితి తీవ్రతరంగా మారింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) లెక్కల ప్రకారం.. కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల (PM2.5) స్థాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. దిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన యూపీ, పంజాబ్ ప్రాంతాల్లో రైతులు పంట దహనాల కారణంగా దిల్లీలో వాయు కాలుష్యం మరింతగా పెరిగినట్లు స్పష్టమవుతోంది. అయితే దిల్లీలో నానాటికీ పెరుగుతున్న వాయు కాలుష్యం కారణంగా.. దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనల్లో భాగంగా ప్రైవేటు ఆఫీసులు 50 శాతం సిబ్బందితో పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. ఇక మిగతా సిబ్బంది ఇంటినుంచే(వర్క్ ఫ్రమ్ హోమ్) చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Delhi AQI Crosses 400 Again 50 Employees Shift to Work From Home

దిల్లీలోని అనేక ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా నమోదు అయింది. అశోక్ విహార్, బవన్ , జహంగీర్ పుర్, వివేక్ విహార్, నెహ్రూ నగర్, నోయిడా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అధికంగా నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాగే దిల్లీతోపాటు గురుగ్రామ్‌, ఫరీదాబాద్‌, ఘజియాబాద్ వంటి ప్రాంతాలను కాలుష్యం అధికంగా ఉన్న ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. అలాగే వాయు కాలుష్య కారకాలను తగ్గించడం, ప్రజలకు కాలుష్యంపై అవగాహన కల్పించడం చేస్తున్నారు. అంతేకాక కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల పని వేళలను తగ్గించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+