Pushpa 2: అల్లు అర్జున్‌ను అలా వాడేస్తోన్నారు..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ.. పుష్ప 2- ది రూల్. ఈ నెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ.. పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. బాక్సాఫీస్‌ను అల్లాడిస్తోంది. విడుదలైన మూడంటే మూడే రోజుల్లో 500 కోట్ల రూపాయాల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందంటే దీని స్టామినా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

వరల్డ్ వైడ్‌గా ఇంత తక్కువ సమయంలో 500 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించిన మూవీ మరొకటి లేదు. కలెక్షన్ల సునామీ ఇప్పట్లో తగ్గేలానూ కనిపించట్లేదు. సినిమా విడుదలైన మూడో రోజు కూడా బుక్ మై షోలో లక్షకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. ఈ స్థాయిలో బుకింగ్ గతంలో ఎప్పుడూ లేవు.

Delhi Assembly election 2025 Arvind Kejriwal s new poster as Pushpa 2 star Allu Arjun Avataar

టాలీవుడ్‌లో ఏ స్థాయిలో బ్లాక్ బస్టర్ సాధించిందో.. దాన్ని రెట్టింపుగా రికార్డులను బద్దలు కొడుతోంది నార్త్ ఇండియాలో. బాలీవుడ్‌లోనే 115 కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. దీని ముందు షారుక్ ఖాన్ జవాన్ రికార్డులు తుత్తునీయలు అయ్యాయి. తొలి మూడు రోజుల్లో జవాన్ సాధించింది 109 కోట్ల రూపాయలే.

సునామీలా నార్త్ ఇండియాను కమ్మేసిన అల్లు అర్జున్ ఛరిష్మాను వినియోగించుకునే ప్రయత్నాల్లో పడింది ఆమ్ ఆద్మీ పార్టీ. అల్లు అర్జున్ స్టైల్‌లో పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్టిల్స్‌ను తయారు చేయించింది. పోస్టర్లను ప్రింట్ చేయించింది. బ్యానర్లు, ఫ్లెక్సీలను కడుతోంది.

ఇంకో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోంది ఢిల్లీ. మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్న ఇక్కడి అసెంబ్లీకి ఫిబ్రవరిలో ఎన్నికలను నిర్వహించడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది అధికార ఆమ్ ఆద్మీ పార్టీ.

ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్‌ను క్రేజ్‌ను మాస్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి తనవంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ను వాడుకుంటోంది. కేజ్రీవాల్.. ఝుకెగా నహీ అంటూ ప్రచారాన్ని చేపట్టింది. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సారథ్యంలో ఎన్నికలను ఎదుర్కొనడానికి రంగం సిద్ధం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+