ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ 2025 Live: ముగిసిన పోలింగ్- ఈవీఎంలలో అభ్యర్థుల జాతకం..!!

ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఢిల్లీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినట్టు ఎక్కడా వార్తలు రాలేదు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో నిలుచున్న వారికి ఓటు వేసే అవకాశం ఈసీ కల్పించింది. సాయంత్రం 5 గంటల వరకు 57.7శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. ఇక అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 8వ తేదీన వెలువడుతాయి. మొత్తానికి ఢిల్లీలో ట్రయాంగిల్ ఫైట్ నెలకొందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాన్ని వెల్లడించారు.

Delhi Assembly Election 2025 Polling Live Updates voter turnout constituency highlights in telugu

కేజ్రీవాల్ అవినీతి చేశాడంటూ బీజేపీ ఆరోపించగా,తాము చేసిన అభివృద్ధిని ప్రజల ముందు ఉంచాడు ఢిల్లీ మాజీ సీఎం. విద్యా వైద్యరంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను తన ప్రచారాస్త్రంగా సంధించారు కేజ్రీవాల్. ఇదిలా ఉంటే ఎన్నికల సంఘం, పోలీసులు కుమ్మక్కయారంటూ కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇక కాంగ్రెస్ కూడా బీజేపీ , ఆమ్ ఆద్మీ పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టింది. మొత్తానికి వాడీ వేడీగా సాగిన ప్రచారం ముగియడంతో ఢిల్లీ రాష్ట్ర మంతా సైలెంట్‌గా మారిపోయింది. ఇక ఓటు అనే ప్రధాన ఆయుధం ప్రజల వద్ద ఉండటంతో అన్ని పార్టీలు భవిష్యత్తు ఓటరు చేతిలోకి వెళ్లిపోయింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడుతాయి. ఇక ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం.

Feb 05, 2025, 6:07 pm IST

ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు బరిలో నిలిచిన 699 మంది అభ్యర్థులు
Feb 05, 2025, 6:07 pm IST

సాయంత్రం ఆరుగంటలలోపు క్యూలైన్‌లో నిలబడిన వారికి ఓటు వేసే అవకాశం కల్పించిన ఈసీ
Feb 05, 2025, 6:06 pm IST

సాయంత్రం 5 గంటల వరకు 57.7శాతం పోలింగ్ నమోదు
Feb 05, 2025, 6:05 pm IST

ముగిసిన ఢిల్లీ ఎన్నికల పోలింగ్.కాసేపట్లో వెలువడనున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు
Feb 05, 2025, 3:19 pm IST
ఢిల్లీ

ఇస్రో చారిత్రాత్మక విజయాలను చాటి చెప్పేలా వికాస్‌పురిలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు. `చంద్రయాన్ సే చునావ్ తక్ భారత్ కీ ఉడాన్` అనే థీమ్‌తో ఈ బూత్‌ను తీర్చిదిద్దారు. స్పేస్ టెలిస్కోప్‌ సైతం ఓటర్ల కోసం అందుబాటులో ఉంచారు.
Feb 05, 2025, 3:16 pm IST
ఢిల్లీ

జంగ్‌పురా నియోజకవర్గం పరిధిలో బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నారంటూ ఆప్ అభ్యర్థి, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చేసిన ఆరోపణలు కొట్టివేసిన ఢిల్లీ పోలీసులు. విచారణ సందర్భంగా అలాంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు తమ దృష్టికి రాలేదంటూ వెల్లడి
Feb 05, 2025, 3:11 pm IST
ఢిల్లీ

తిమార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ వద్ద బీజేపీ క్యాంప్‌ను సందర్శించిన ఆ పార్టీ ఎంపీ మనోజ్ తివారీ. కార్యకర్తలతో ముచ్చట్లు
Feb 05, 2025, 2:19 pm IST
ఢిల్లీ

కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లాట్. ఈ ఎన్నికల్లో ఆయన బిజ్వాసన్ నుంచి బరిలో నిలిచారు.
Feb 05, 2025, 1:55 pm IST

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 33.31 శాతం పోలింగ్ నమోదైంది.
Feb 05, 2025, 1:43 pm IST

మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉత్తరప్రదేశ్ లోని మిల్కీపూర్ లో 44.59 శాతం పోలింగ్ నమోదైంది.
Feb 05, 2025, 1:42 pm IST

తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు) ఉప ఎన్నికలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 42.41 శాతం పోలింగ్ నమోదైంది.
Feb 05, 2025, 1:37 pm IST

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన సతీమణి సునీతా కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు
Feb 05, 2025, 1:25 pm IST

బాగా ఆలోచించి ఓటు హక్కును వినియోగించుకోండి: ఢిల్లీ ఓటర్లకు ప్రియాంక గాంధీ విజ్ఞప్తి
Feb 05, 2025, 1:17 pm IST

ఢిల్లీలో మార్పు ప్రభంజనం వీస్తోంది. అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేస్తున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ్ అన్నారు. ఇప్పుడు ఈ 'ఆప్-దా' - 'ఫార్జీ' ప్రభుత్వం ఫేక్ ఓటింగ్ కు అవకాశం కల్పించే స్థాయికి వచ్చింది. కస్తూర్బా నగర్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు వేస్తూ పట్టుబడ్డారని ఆరోపించారు. విక్షిత్ భారత్, విక్షిత్ ఢిల్లీ ఉండాలన్న ప్రధాని మోదీ సంకల్పాన్ని నెరవేర్చడానికి పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని ఢిల్లీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Feb 05, 2025, 12:59 pm IST
ఢిల్లీ

చిరాగ్ ఢిల్లీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన 17 పోలింగ్ కేంద్రాలకు వెళ్తోన్న ఓటర్లను పోలీసులు అడ్డుకుంటోన్నారంటూ ఆరోపించిన గ్రేటర్ కైలాష్ ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్. ఎక్కడికక్కడ బ్యారికేడ్లుగా అడ్డుగా పెట్టారంటూ విమర్శలు
Feb 05, 2025, 12:06 pm IST
ఢిల్లీ

తుగ్లక్ క్రీసెంట్‌లో ఏర్పాటు చేసిన వీవీఐపీ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.
Feb 05, 2025, 12:04 pm IST
ఢిల్లీ

నిర్వాణ భవన్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ.
Feb 05, 2025, 12:02 pm IST
ఢిల్లీ

తీన్‌మూర్తి ప్రాంతంలోని లయన్స్ విద్యామందిర్ సెకెండరీ స్కూల్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఆయన భార్య కల్పన దాస్
Feb 05, 2025, 11:56 am IST
ఢిల్లీ

ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్‌ పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవి.
Feb 05, 2025, 11:53 am IST
ఢిల్లీ

తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్‌ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న అరవింద్ కేజ్రీవాల్, ఆయన భార్య సునీతా కేజ్రీవాల్, తల్లిదండ్రులు గోవింద్ రామ్ కేజ్రీవాల్, గీతా దేవి.
Feb 05, 2025, 11:51 am IST
ఢిల్లీ

రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ కాంగ్రెస్ లోక్‌సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ వాద్రా విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో అనేక సమస్యలు ఉన్నాయని, ఓటు ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని కోరారు.
Feb 05, 2025, 11:47 am IST
ఉత్తర్ ప్రదేశ్

మిల్కీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 29.86 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
Feb 05, 2025, 11:46 am IST
తమిళనాడు

ఈరోడ్‌ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో ఉదయం 11 గంటల వరకు 26.03 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
Feb 05, 2025, 11:45 am IST
ఢిల్లీ

ఉదయం 11 గంటల వరకు 19.95 శాతం ఓటింగ్ నమోదైనట్లు ప్రకటించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
Feb 05, 2025, 11:29 am IST
ఉత్తర్ ప్రదేశ్

మిల్కీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికలు అక్రమాలు చోటు చేసుకుంటోన్నాయి. పోలీసులు ఓటరు గుర్తింపుకార్డును తనిఖీ చేయడం ఈసీ నిబంధనలను ఉల్లంఘించినట్టే. దీనిపై ఈసీ జోక్యం చేసుకోవాలి- సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్
Feb 05, 2025, 11:14 am IST
ఢిల్లీ

తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నార్త్ అవెన్యూ పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌కర్ దంపతులు. తమవంతు వచ్చేవరకు సాధారణ పౌరుల్లా క్యూ లైన్‌లో నిల్చున్నారు.
Feb 05, 2025, 11:10 am IST
ఢిల్లీ

తమ ఓటు హక్కును వినియోగించుకున్న సీపీఎం సీనియర్ నేతలు ప్రకాశ్ కారత్, బృందా కారత్.
Feb 05, 2025, 11:08 am IST
ఢిల్లీ

రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయాలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
Feb 05, 2025, 11:03 am IST
ఢిల్లీ

తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించారని, ప్రతి ఒక్కరూ తమ ఓటు వేయాలంటూ విజ్ఞప్తి.
Feb 05, 2025, 10:53 am IST

చత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం అరుణ్ సావో మాట్లాడుతూ. ఢిల్లీ ప్రజలు మార్పు కోసం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఓటు వేస్తున్నారు. కచ్చితంగా ఢిల్లీలో కమలం వికసిస్తుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ పేదలకు ద్రోహం చేసిందని, పేదల జీవితాలను ఉద్ధరించడానికి తాము కృషి చేస్తున్నామని ప్రధాని పునరుద్ఘాటించారని పేర్కొన్నారు.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+