అంతా వేస్ట్ అయ్యింది..: దిగాలుగా ఛోటా కేజ్రీవాల్
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆసక్తికరంగా వెలువడుతోన్నాయి. బీజేపీ ప్రభంజనం కనిపించింది. ఆ పార్టీ అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో ఆధిక్యతలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెనుకపడినట్టే. ఇక కాంగ్రెస్ పార్టీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మొత్తం 70 నియోజకవర్గాలు ఉన్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 36. 2013లో తలి సారిగా దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇఫ్పటివరకూ చెక్కు చెదరలేదా పార్టీ ఓటుబ్యాంక్. ఇప్పుడు ఫలితం తిరగబడే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దీనికి అనుగుణంగా ఫలితాలు వెలువడుతున్నాయి. క్లీన్ స్వీప్ దిశగా సాగుతోంది బీజేపీ.

ఫలితాలు వెలువడుతున్న కొద్దీ బీజేపీలో జోష్ పెరిగింది. ఈ తెల్లవారు జాము నుంచే ఆ పార్టీ ఢిల్లీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. బాణాసంచా కాల్చారు. స్వీట్లను పంచిపెట్టారు. రంగులు చల్లుకున్నారు. డోలు వాయిస్తూ సందడి చేశారు. కాషాయ జెండాలను ఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు జిందాబాద్ కొట్టారు.
మరోవంక- ఆమ్ ఆద్మీ పార్టీలో దీనికి పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. మూగబోయిందా పార్టీ కార్యాలయం. బోసిగా కనిపించింది. ప్రాభవాన్ని కోల్పోయింది. అటు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం సైతం వద్దా ఇలాంటి వాతావరణమే నెలకొంది.
తొలుత- బాణసంచా, పార్టీ జెండాలతో ఆమ్ ఆద్మీ కేంద్ర కార్యాలయం, అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కనిపించారు నాయకులు, కార్యకర్తలు. ఫలితాలు వెలువడుతున్న కొద్దీ నిరాశ నిస్పృహలకు గురయ్యారు. కేజ్రీవాల్, ఆతిషీ, మనీష్ సిసోడియా వంటి హేమాహేమీలు సైతం వెనుకంజలో పడటంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. గుంపులు గుంపులుగా అక్కడి నుంచి నిష్క్రమించడం కనిపించింది.
ఈ హడావుడి మధ్య ఓ తొమ్మిది సంవత్సరాల వయస్సున్న ఓ బాలుడు ఆకర్షించాడు. అతని పేరు అవ్యాన్ తోమర్. అచ్చంగా అరవింద్ కేజ్రీవాల్‌ను తలపించేలా డ్రెస్ అప్ అయ్యాడు. కళ్లజోడు ధరించాడు. కేజ్రీవాల్ తరహా జర్కిన్ వేసుకుని ఆయన ఇంటి వద్ద సందడి చేశాడు. అతని తల్లిదండ్రులిద్దరూ ఆమ్ ఆద్మీ పార్టీ సానుభూతిపరులే.












Click it and Unblock the Notifications