ఢిల్లీ పేలుడు బాంబర్ ఉమర్ నబీ ఇల్లు పేల్చివేత..!
భారత్‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస పేలుడు ఘటనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. లేటెస్ట్ గా ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన ఈ పేలుడులో సుమారు 12 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ పేలుడుకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డా. ఉమర్ మహ్మద్ తన సహచరులు అరెస్ట్ కావడంతో భయాందోళనకు గురై ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణ జరుగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎర్రకోట పేలుడుకు కారణమైన కారును నడిపిన ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్ నబీ ఇంటిని భద్రతా దళాలు కూల్చివేశాయి. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న ఉమర్ నబీ నివాసాన్ని గురువారం అర్ధరాత్రి తర్వాత కూల్చివేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పేలుడు కేసు విచారణలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

కాగా ఈ ఘటన హ్యుందాయ్ ఐ20 కారు ద్వారానే జరిగిందని అధికారులు గుర్తించారు. పలు సీసీటీవీ ఫుటేజ్‌లను విశ్లేషించిన తర్వాత, ఈ కారును డాక్టర్ ఉమర్ నబీ నడిపినట్లు తేలింది. కారులో లభించిన ఆధారాలను ఉమర్ నబీ కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో సరిపోల్చగా, కారును నడిపింది అతనేనని నిర్ధారణ అయ్యింది. ఈ పేలుడులో ఉమర్ నబీ కూడా మరణించినట్లు అధికారులు ధృవీకరించారు.
అంతే కాకుండా ఈ ఘటనకు ఫరీదాబాద్‌లో భగ్నం చేసిన ఉగ్రకుట్రతో ముడిపడి ఉన్నట్లు భద్రతా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఫరీదాబాద్‌లోని తన సహచరులు డా. ముజామిల్ షకీల్, డా. ఆదీల్ అహ్మద్ రథర్ అరెస్టు కావడంతో ఉమర్ భయాందోళనకు గురై ఈ ఘటనకు పాల్పడినట్టు భావిస్తున్నారు. తన వద్ద ఉన్న పేలుడు పదార్థాలపై ఆందోళన చెంది తాను కూడా పట్టుబడతాననే భయంతో ఆత్మహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు పేర్కొంటున్నాయి.
అలానే సంఘటన జరిగిన సమయంలో అసంపూర్తిగా ఉన్న ఐఈడీ బాంబును మరోచోటుకు తరలిస్తుండగా లేదా దానిని రోడ్డుపై విసిరేసే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. పేలుడుకు అమ్మోనియం నైట్రేట్ ఫ్యూయల్ ఆయిల్, డిటోనేటర్లను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఉగ్ర నెట్‌వర్క్ వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications