అన్ని చోట్లా క్యాంటీన్ల ఏర్పాటు- రూ. 100 కోట్లు కేటాయింపు: మహిళలపైనా వరాలు

Atal Canteens అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో పొందుపరిచిన వాగ్దానాలను అమలు చేసే దిశగా- ముఖ్యమంత్రి రేఖా గుప్తా సారథ్యంలో ఢిల్లీలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.. అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కీలక నిర్ణయాలను తీసుకుంది.

హామీలను అమలు చేయడానికి 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేపట్టింది. ఇందులో మహిళల భద్రత, విద్య- వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందక్కడి కమలనాథుల సర్కార్.

Delhi Budget 2025 Govt allocates Rs 5100 cr for Rs 2 500 per month to eligible women

బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలిసారిగా సమావేశమైంది ఢిల్లీ అసెంబ్లీ. రేఖా గుప్తా బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టారు. లక్ష కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖను స్వయంగా ఆమెనే పర్యవేక్షిస్తోన్నారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పలు అంశాల గురించి ప్రస్తావించారు. దీన్ని చారిత్రాత్మక బడ్జెట్‌గా అభివర్ణించారు.

10 సంవత్సరాల పాటు ఢిల్లీని పరిపాలించిన అవినీతి, అసమర్థ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి జనం చరమగీతం పాడారని రేఖా గుప్తా అన్నారు. మాజీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, ఆతిషి సారథ్యంలో ఆప్ పాలన భ్రష్టు పట్టిందని, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం ఇష్టారీతిన సాగిందని విమర్శించారు. వీటన్నింటినీ తుడిచిపెట్టేలా లక్ష కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు చెప్పారు.

మూల ధన వ్యయం 28,000 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనకు 2,144 కోట్ల రూపాయలను కేటాయించారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నామని, ఈ క్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఢిల్లీ- నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలో 50,000 సీసీటీవీ కెమెరాలను అమర్చనున్నట్లు చెప్పారు.

కనెక్టివిటీని మరింత పెంచడానికి 1,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రేఖా గుప్తా వివరించారు. ఈ మొత్తంతో కొత్త రోడ్లు వేస్తామని, మరమ్మతులు చేస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతానికి ఈ నిధులను వినియోగించుకుంటామని పేర్కొన్నారు.

Take a Poll

అర్హులైన ప్రతి మహిళకూ ప్రతి నెలా 2,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయడానికి ఉద్దేశించిన పథకానికి 5,100 కోట్ల రూపాయలను కేటాయించినట్లు రేఖా గుప్తా తెలిపారు. దీనితోపాటు అన్ని చోట్ల కూడా అటల్ క్యాంటీన్లను నెలకొల్పబోతోన్నామని, దీనికోసం 100 కోట్ల రూపాయలను వ్యయం చేయనున్నట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+