రేప్ చేయలేదు.. ఆమెను అలా బెదిరించలేదు: ఉబెర్ క్యాబ్ డ్రైవర్
న్యూఢిల్లీ: గత డిసెంబర్ నెలలో ఓ ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఉబెర్ క్యాబ్ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌ను మంగళవారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు అతని వాంగ్మూలాన్ని రికార్డు చేసుకుంది. తాను ప్రయాణికురాలిపై అత్యాచారానికి పాల్పడలేదని నిందితుడు శివకుమార్ కోర్టుకు తెలిపాడు.
తనను తప్పుగా ఈ కేసులో ఇరికించారని నిందితుడు చెప్పాడు. ‘నా కారులో కూర్చున్న వెంటనే ఆ యువతి ఏడ్వడం ప్రారంభించింది. ఆమెను ఎందుకు ఏడుస్తున్నావని అడిగాను. నీకెందుకని ఆమె నన్ను తిట్టింది. ఆ తర్వాత ఆమె ఫోన్లో మాట్లాడుతూ ఆయూష్ తనతో తప్పుగా వ్యవహరించాడని తెలిపింది. అప్పుడు ఆమె తన కాబోయే భర్త అక్షయ్‌తో మాట్లాడింది' కోర్టులో నిందితుడు తెలిపాడు.

పంజాబీ భాగ్‌లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉండటంతో రాంపురా మీదు ఇండోర్లోక్ చేరుకునేందుకు ప్రయత్నించానని చెప్పాడు. ఆ తర్వాత ఆమెను తన ఇంటి వద్ద దింపి వెళ్లిపోయానని చెప్పాడు.
‘సరాయి రోహిల్లాలోని 56 బిఘా పార్క్‌లో సమీపంలో నా కారును పార్క్ చేశా. అయితే నా కారులో ఆమె తన ఫోన్‌ను మర్చిపోయినట్లు గుర్తించా. ఆ సమయంలో ఆమె ఫోన్‌కు నుంచి ఆమె తల్లి నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేయడంతో ఆ సెల్ తిరిగివ్వమని ఆమె నన్ను కోరింది. దీంతో నేను మళ్లీ ఆ యువతికి ఇంటికి వెళ్లి ఆమె ఫోన్‌ను తిరిగిచ్చేశాను. అయితే నేను ఆమెపై అత్యాచారం చేశానని ఎందుకు ఆరోపించిందో తెలియలేదు' అని శివకుమార్ తెలిపాడు.
తాను ఆమెను నిందించలేదని.. ఆమె పట్ల అసభ్యంగా కూడా ప్రవర్తించలేదని నిందితుడు చెప్పాడు. తాను ఇనుప రాడ్‌ను ఆమె ప్రైవేట్ భాగాల్లో పెడతానని బెదిరింపులకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణల్లో కూడా నిజం లేదని చెప్పాడు.












Click it and Unblock the Notifications