మరో అతుల్! భార్య వేధింపులు తాళలేక కేఫ్ యజమాని బలవన్మరణం

భార్య వేధింపులు తాళలేక బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే అలాంటి ఘటనలే వరుసగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి తన భార్య వేధింపులతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఢిల్లీకి చెందిన వుడ్ బాక్స్ కేఫ్ యజమాని పునీత్ ఖురానా(40), ఆయన భార్య మాణికా పహ్వా విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

అయితే, ఈ క్రమంలోనే మాణికా పహ్వా, ఆమె కుటుంబసభ్యులు పునీత్‌ను వేధింపులకు గురిచేశారు. ఈ వేధింపులు ఎక్కువ కావడంతో పునీత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పునీత్ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య మాణికా పహ్వా అతడ్ని మానసికంగా వేధించిందని కుటుంబీకులు ఆరోపించారు. ఈ క్రమంలోనే మంగళవారం మోడల్ టౌన్ నివాసంలో పునీత్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.

Delhi Cafe owner commits suicide after being harassed by wife

పునీత్ సోదరి మాట్లాడుతూ.. మాణికా పహ్వా, ఆమె తల్లిదండ్రులు, ఆమె సోదరి కలిసి పునీత్‌ను వేధించారు. అతడిపై ఒత్తిడి తీసుకువచ్చి నువ్వు ఏం చేయలేవని, నీకు ధైర్యం ఉంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపో అంటూ ప్రేరేపించారని తెలిపారు. కాగా, పునీత్ మరణానికి ముందు అతడి ఫోన్లో ఓ వీడియో రికార్డ్ చేశారు. మాణికా, ఆమె తల్లిదండ్రుల వేధింపులే కారణమని అందులో పేర్కొన్నాడు.

పునీత్, మాణికా మధ్య వ్యాపార సంబంధ వివాదం కూడా ఉందని పునీత్ సోదరి తెలిపారు. ఇంతకుముందు వారిద్దరు భాగస్వామ్యంలో బేకరీ వ్యాపారం చేశారని, కానీ, విడాకుల కోసం సంతకాలు జరిగిన తర్వాత పునీత్ గాడ్స్ బేకరినీ, మాణికా వుడ్ బాక్స్ కేఫ్‌ని నిర్వహించాలని రాత పూర్వకంగా నిర్ణయించారు. దీని తర్వాత ఆమె తన షేర్‌ని వదులుకోనని చెప్పిందని.. అంతేగాక, పునీత్ కు తరచూ ఫోన్ చేసి తన వాటా కోసం వేధించిందని పునీత్ సోదరి తెలిపాపరు.

అంతేగాక, పునీత్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను మాణికా హ్యాక్ చేసిందని, ఆ తర్వాత ఇతర వ్యక్తులతో అనుచితంగా చాటింగ్ చేసిందని పునీత్ సోదరి తెలిపారు. దీని కారణంగా తన సోదరుడు తెల్లవారుజామున 3 గంటలకు ఫోన్ చేయాల్సి వచ్చిందని, తమ వద్ద రికార్డింగ్ ఉందని ఆమె చెప్పారు. విడిపోయిన తర్వాత తన కొడుకు బాగున్నాడని పునీత్ తల్లి తెలిపారు. అయితే, మాణికా మాత్రం తన కొడుకుని చిత్రహింసలు పెట్టిందని, అన్నింటినీ మౌనంా భరించాడని ఆవేదన వ్యక్తి చేసింది.

తాము బాధపడతామని తమకు ఏదీ చెప్పేవాడు కాదని పునీత్ తల్లి కన్నీటిపర్యంతమైంది. కొడుకును కోల్పోయిన తనకు న్యాయం చేయాలని పునీత్ తల్లి వేడుకుంటోంది. కాగా, 2016లో పునీత్, మాణికాల వివాహం జరిగింది. రెండేళ్ల క్రితమే విడిపోయిన వీరి విడాకుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే మాణికా వేధింపులు భరించలేక పునీత్ ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.

కాగా, ఇటీవల జరిగిన అతుల్ సుభాష్ ఆత్మహత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. భార్య నిఖితా సింఘానియా వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా సుభాష్ ఆత్మహత్య చేసుకున్నారు. 24 పేజీల సూసైడ్ నోట్ రాసిపెట్టడంతోపాటు గంటకుపైగా వీడియోను రికార్డ్ చేశాడు. భార్య ఆమె కుటుంబం వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వివరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+