గ్యాస్ సరఫరా తాజా గైడ్ లైన్స్- ప్రాధాన్యతలు ఖరార్

ఇరాన్ యుద్ధం కారణంగా దేశంలో వంటగ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దేశంలోని వివిధ నగరాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. డొమెస్టిక్, కమర్షియల్ అనే తేడా ఏదీ ఉండట్లేదు. అన్ని వర్గాల వారి మీదా దీని ప్రభావం పడింది. హోటళ్ల యజమానులు ఏకంగా సెలవులను ఇచ్చుకునే పరిస్థితి తలెత్తిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి తలెత్తింది. వంట వండటానికి ఇతర వనరులపై ఆధారపడాల్సి వస్తోంది.

ఈ పరిణామాల మధ్య ప్రాధాన్యత ఆధారిత పంపిణీ విధానాన్ని ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వాణిజ్య సిలిండర్ల రోజువారీ పంపిణీని సగటు వినియోగంలో సుమారు 20 శాతానికి పరిమితం చేసింది. ఈ నిర్ణయం వాణిజ్య సంస్థలకు ఇంధన లభ్యతపై ప్రభావం చూపనుంది.

Delhi Caps Commercial LPG to 20 Percent of Average Supply to Safeguard Essential Services 8 category

ఢిల్లీలో సాధారణంగా రోజుకు దాదాపు 9,000 వాణిజ్య సిలిండర్లు సరఫరా అవుతుంటాయి. కొత్త విధానం కింద ఇకపై 1,800 సిలిండర్లు మాత్రమే పంపిణీ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆహార, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నగర సగటు రోజువారీ వాణిజ్య వినియోగంలో 20 శాతం మాత్రమే సరఫరా చేయాలని నిర్ణయించింది. దీనికోసం కమర్షియల్ వినియోగదారులను ఎనిమిది కేటగిరీలుగా వర్గీకరించింది.

1. ఇందులో టాప్ ప్రయారిటీ- ఆసుపత్రులు, విద్యాసంస్థలు, రైల్వేలు, విమానాశ్రయాలకు లభించింది. 100 శాతం గ్యాస్ కేటాయింపు ఉంటుంది. వీటికి ఎటువంటి కోతా ఉండదు.

2. క్యాంటీన్‌లు నడిపే ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు రెండో ప్రాధాన్యత వర్గంలోకి చేరాయి. వీటికి 236 సిలిండర్‌లను కేటాయిస్తారు.

3. రెస్టారెంట్లు, ప్రైవేట్ క్యాంటీన్లు మూడో కేటగిరీలో వచ్చాయి. 762 సిలిండర్లను వీటికి సరఫరా చేస్తారు. ఈ పరిమితి మించకూడదు.

4. హోటళ్లు, ఆతిథ్య యూనిట్లు, అతిథి గృహాలు నాలుగో కేటగిరీలో చేర్చారు. వీటికి 72 సిలిండర్లను సరఫరా చేస్తారు.

5. డెయిరీలు, బేకరీలు, స్వీట్ షాపులకు అయిదో ప్రాధాన్యత కింద 200 సిలిండర్‌లను కేటాయించారు.

6. క్యాటరర్లు, బాంకెట్ హాల్‌లను ఆరో ప్రాధాన్యతగా గుర్తించారు. వీటికి 162 సిలిండర్లను పంపిణీ చేస్తారు.

7. ఏడో ప్రాధాన్యత జాబితాలో డ్రై-క్లీనింగ్, క్లీనింగ్, ప్యాకేజింగ్, ఫార్మాస్యూటికల్ యూనిట్లు ఉన్నాయి. వీటికి 18 సిలిండర్లు అందుతాయి.

8. క్రీడా సౌకర్యాలు, స్టేడియాలను ఎనిమిదో కేటగిరీగా 150 సిలిండర్లను సరఫరా చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+