49 రోజులకే ముగిసిన కథ: కేజ్రీవాల్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. జన్ లోక్‌పాల్‌ను శాసనసభలో ప్రవేశపెట్టకుండా కాంగ్రెసు, బిజెపి అడ్డుకున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. శానససభ నిరవధికంగా వాయిదా పడగానే పార్టీ రాత్రి ఎనిమిది గంటలకు వాలంటీర్లను పార్టీ కార్యాలయానికి రావాల్సిందిగా కేజ్రీవాల్ ఆహ్వానించారు. వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించిన తర్వాతనే ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించినట్లు వార్తలు వచ్చాయి.
కేజ్రీవాల్ రాజీనామా చేసినట్లు పిటిఐ వార్తాసంస్థ తెలిపింది. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత ఆయన తన చివరి మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు. పూర్తి మెజారిటీ పొందని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెసు సహకారంతో ఢిల్లీలో అధికారాన్ని చేపట్టింది. అధికారం చేపట్టి 49 రోజులు గడిచాయి. కాంగ్రెసు, బిజెపి చేతులు కలిపాయన ఆయన విమర్సించారు. తమ రాజీనామాతో ఢిల్లీలో ఎన్నికలు అనివార్యం కావచ్చునని కేజ్రీవాల్ అన్నారు. తమకు లాలూచీ రాజకీయాలు తెలియవని ఆయన అన్నారు.

శాసనసభలో తన రాజీనామా విషయంపై అరవింద్ కేజ్రీవాల్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఇది చివరి సెషన్‌లాగా కనిపిస్తోందని ఆయన శుక్రవారం శాసనసభలో అన్నారు. జన్ లోక్‌పాల్ బిల్లును అడ్డుకుంటే రాజీనామా చేస్తానని ఆయన ముందే హెచ్చరించారు. జన్ లోక్‌పాల్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెసు, బిజెపి సభ్యులు అడ్డుకున్నారు. బిల్లును ప్రతిపాదించడాన్ని వ్యతిరేకిస్తూ 42 మంది సభ్యులు ఓటు చేయగా, సమర్థిస్తూ 27 మంది సభ్యులు ఓటు చేశారు.
జన్ లోక్‌పాల్ బిల్లును ప్రతిపాదించకుండా కాంగ్రెసు, బిజెపి సభ్యులు అడ్డుకున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. కేజ్రీవాల్ ప్రసంగాన్ని ప్రతిపక్షాల సభ్యులు అడ్డుకున్నారు. గత రెండు రోజులుగా శాసనసభలో జరుగుతున్న సంఘటనల పట్ల తాను తీవ్ర నిరాశకు గురైనట్లు కేజ్రీవాల్ తన శాసనసభ ప్రసంగంలో తెలిపారు.












Click it and Unblock the Notifications