800 లకు పైగా కంపెనీలు మూసివేత.. కారణం తెలిస్తే షాక్..

దేశ రాజధాని నగరం దిల్లీలో వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా చేసేందుకు వీలుగా అలాగే ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ ను పెంపొందించే విధంగా నిర్ణయాలు తీసుకుంది. అలాగే వాయు కాలుష్య నియంత్రణకు కఠినమైన చర్యలను తీసుకోనుంది. ఈ మేరకు దిల్లీ పర్యావరణశాఖ మంత్రి మంజీందర్ సింగ్ ఈ విషయాలను వెల్లడించారు.

దిల్లీలో వాయు కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దిల్లీలో నడిచే ఇతర బస్సులను రద్దు చేశారు. కేవలం దిల్లీ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్(DTC) బస్సులను మాత్రమే ప్రయాణ సౌకర్యానికి వినిగించాలని ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో దిల్లీలో 50 శాతం నడుస్తున్న దిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ- మోడల్ ట్రాన్సిట్ సిస్టమ్(DIMTS) ను రద్దు చేశారు. ఈ విధానం ద్వారా దిల్లీ ప్రజలు ప్రభుత్వ రవాణాను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని అలాగే ప్రభుత్వ రవాణా సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు.

అలాగే దిల్లీలోని హోలంబి కలాన్ ప్రాంతంలో ఈ- వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు దిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ 11.5 ఎకరాల్లో పూర్తి స్థాయిలో సకల సదుపాయాలతో నిర్మాణం కానుంది. అలాగే దిల్లీలోని దాదాపు 1000 చెరువులు, కుంటలను శుభ్రం చేసి వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం .. దీనికోసం రూ. 100 కోట్లను కేటాయించింది దిల్లీ కేబినెట్.

అంతేకాక వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు విధించిన కఠినమైన చర్యల్లో భాగంగా ఇకపై దిల్లీలో పోల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్(PUCC) లేకుండా పెట్రోల్ విక్రయం అనేది జరగదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారులు దిల్లీలో PUCC సెంటర్లను పరిశీలిస్తున్నారు. వీటిల్లో రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించిన 12 సెంటర్లను రద్దు చేశారు.

Delhi Chokes Govt Orders Shutdown of Over 800 Polluting Industries Amid Worsening Smog Crisis

దిల్లీలో పెరుగుతున్న ఇండస్ట్రీయల్ కాలుష్యాన్ని తగ్గించేందుకు రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ వ్యాప్తంగా కాలుష్యాన్ని వెదజల్లే 800 లకు పైగా ఇండస్ట్రీస్ ను మూసివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు 411 యూనిట్లకు దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ నోటీసులను జారీ చేసింది. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ దిల్లీ దాదాపు 400 ఇండస్ట్రీస్ ను మూసేసింది. దిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విధమైన నిర్ణయాలను తీసుకుంటోంది. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యల్లో రాజీ పడే ప్రసక్తే లేదని దిల్లీ సీఎం రేఖ గుప్తా స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+