delhi clashes: ఢిల్లీ స్పెషల్ పోలీసు కమిషనర్‌గా ఎస్ఎన్ శ్రీవాత్సవ, శాంతి భద్రతల పర్యవేక్షణ
ఢిల్లీ ఘర్షణల నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో అడ్డుకట్ట వేసేందుకు.. సీనియర్ పోలీసు అధికారిని రంగంలోకి దించారు. సీఆర్పీఎఫ్‌కు చెందిన ఎన్ శ్రీ వాత్సవను ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్, చాంద్‌బాగ్ తదితర ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు శ్రీ వాత్సవ అండ్ టీం రంగంలోకి దిగారు.
1985 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎస్ఎన్ శ్రీ వాత్సవ సీఎర్పీఆఫ్‌లో పనిచేస్తున్నారు. మంచి అధికారుగా శ్రీ వాత్సవకు పేరు ఉంది. సీఆర్పీఎఫ్‌కు చెందిన అముల్య పట్నాయక్ తర్వాత ఢిల్లీ సీపీ బాధ్యతలను శ్రీ వాత్సవ నిర్వహించబోతున్నారు. అయితే ఇదివరకే పరిసరాల్లో శ్రీ వాత్సవకు పనిచేసిన అనుభవం ఉంది. ఇండియన్ ముజాహిద్దీన్‌కు సంబంధించి దర్యాప్తులో శ్రీ వాత్సవ ముఖ్యభూమిక పోషించారు. స్పెషల్ పోలీసు కమిషనర్‌గా శ్రీ వాత్సవ శాంతి భద్రతలను పర్యవేక్షించనున్నారు.

Recommended Video

ఢిల్లీలో పరిస్థితులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరసగా సమీక్షిస్తున్నారు. తన త్రివేండ్రం పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. ఆందోళన చేపట్టిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారు వెనక్కి వెళ్లకపోవడంతో.. వాటర్ క్యానన్లను ప్రయోగించారు.












Click it and Unblock the Notifications