వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారానికి పైగా ఎల్జీ నివాసంలో ఆందోళన: ధర్నా విరమించిన కేజ్రీవాల్, మంత్రులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: వారం రోజులకు పైగా నిరసన దీక్ష చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం విరమించారు. వరుస భేటీలు, చర్చల అనంతరం సమస్య పరిష్కారమైంది. జూన్ 11వ తారీఖు నుంచి కేజ్రీవాల్, మంత్రులు ధర్నా చేస్తున్నారు.

ఢిల్లీలో ఐఏఎస్ అధికారులు ఆందోళన చేస్తున్నారని, వారి ఆందోళలను విరమింప చేసేలా లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ చొరవ తీసుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలోనే ధర్నా చేశారు. అలాగే పలు సమస్యలు పరిష్కరించాలన్నారు.

ఈ నిరసన దీక్షలో భాగంగా ఇద్దరు మంత్రులు స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రికి కూడా తరలించారు. కేజ్రీవాల్ ధర్నాకు పలువురి నుంచి మద్దతు కూడా లభించింది.

Delhi CM Arvind Kejriwal ends sit-in protest at L-G’s office

ఐఏఎస్ అధికారులను వెంటనే కలిసి చర్చించాలని లెఫ్టినెంట్ గవర్నర్ బైజాల్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. ఐఏఎస్ అధికారులు తిరిగి వర్క్ చేసేందుకు వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అన్నారు.

కేజ్రీవాల్‌తో పాటు మనీష్ సిసోడియా, మంత్రులు సత్యేంద్ర జైన్, గోపాల్ రాయ్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఎదుట గత వారానికి పైగా దీక్ష చేస్తున్నారు. ఐఏఎస్ అధికారుల ఆందోళనను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు దీక్ష విరమించడంతో మంత్రులు కూడా తిరిగి విధుల్లోకి వచ్చినట్లయింది.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal called off his weeklong sit-in protest at Delhi Lieutenant Governor Anil Baijal's office on Tuesday in a series of developments that indicated that the logjam would be resolved.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X