Arvind Kejriwal: కేంద్రం ఆర్డినెన్స్ వ్యతిరేకంగా రాహుల్, మల్లికార్జున ఖర్గేను కలవనున్న కేజ్రీవాల్..!
ఢిల్లీ ఉద్యోగులపై అధికారల విషయంలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరును తీవ్రతంర చేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిర్ణయించారు. అందులో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీని కలవాలని యోచిస్తున్నట్లు గురువారం తెలిపారు. ముంబైలోని యశ్వంతరావు చవాన్ సెంటర్‌లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్‌తో సమావేశమైన తర్వాత ఖర్గే, రాహుల్ గాంధీని కలవాలని అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పవార్ ను కలిసిన వారిలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఉన్నారు.
"రేపు నేను అధికారికంగా ఖర్గే జీ, రాహుల్‌గాంధీలతో సమయం తీసుకుని ఈ అంశంపై మాట్లాడతాను" అని పవార్‌తో భేటీ అనంతరం కేజ్రీవాల్ చెప్పారు.ఢిల్లీ ప్రజలకు చాలా అన్యాయం జరుగుతోందని కేజ్రీవాల్ అన్నారు. 2015 నుంచి 2023 వరకు కోర్టులో పోరాటం చేశామని గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల తర్వాత ఢిల్లీ ప్రజలకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎనిమిది రోజుల్లోనే తమ అధికారాన్ని హరించేలా ఆర్డినెన్స్ తీసుకొచ్చారని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటంలో మద్దతు కోరేందుకు ఆప్ ప్రతి పక్షాలను సంప్రదిస్తోందని ఢిల్లీ సీఎం చెప్పారు.

కేంద్రం ఆర్డినెన్స్‌పై పోరాటంలో ఆప్‌కి మద్దతివ్వాలా వద్దా అనే దానిపై కాంగ్రెస్ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. "అధికారుల నియామకానికి సంబంధించి ఢిల్లీలోని NCT ప్రభుత్వ అధికారాలపై SC తీర్పుకు వ్యతిరేకంగా తెచ్చిన ఆర్డినెన్స్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు" అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అన్నారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అజయ్ మాకెన్‌తో సహా కొంతమంది ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో పార్టీ ఆప్‌కి మద్దతు ఇవ్వాలనే ఆలోచనపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్‌కు మద్దతు ఇవ్వడం నెహ్రూ, అంబేద్కర్‌ల విజ్ఞతకి విరుద్ధమని మాకెన్ ట్విట్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఢిల్లీలో పనిచేయడానికి అనుమతించడం లేదని ఆప్ చేసిన ఆరోపణలు ఒక సాకుగా ఉన్నాయని, దాని "నిరుపయోగానికి" అద్దం పడుతుందని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు. కేజ్రీవాల్ శరద్ పవార్ ను కలవడానికి ముందు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేను కలిశారు. కోర్టు వేసవి సెలవుల అనంతరం ఆప్ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై సుప్రీం కోర్టుకు వెళ్లనుంది. అప్పటి వరకు పలు పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది.












Click it and Unblock the Notifications