పంద్రాగస్టు వేడుకల్లో 'కేజ్రీవాల్': వివాదంలో ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి విమర్శల పాలయ్యారు. 69వ స్వాతంత్ర దినోత్సవం నాడు... వేడుకల్లో ఆయన పేరు ఉండటం విమర్శలకు దారి తీసింది.
కేజ్రీవాల్‌ను వివాదాలు ఒకదాని తర్వాత ఒకటి చుట్టుముడుతున్నాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో విన్యాసాలు చేస్తున్న విద్యార్థులు పలుమార్లు ఆయన పేరును ప్రదర్శించారు.
దీనిపై బిజెపి, ఏఏపీ బహిష్కృత నేతలు, విపక్షాలు మండిపడ్డాయి. వేడుకల్లో కేజ్రీవాల్ పేరు పదేపదే కనిపించింది. దీనిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇది తనకు తెలియకుండా జరిగిందన్నారు. కొందరు విద్యార్థులు తన పేరును ప్రదర్శించారని, వీరిలా చేస్తారని తనకు తెలియదన్నారు.

భవిష్యత్తులో ఇలా జరగకుండా చూస్తానని చెప్పారు. ఆప్ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ మాత్రం తీవ్రమైన విమర్శలు చేశారు. జై హింద్ అనాల్సిన చోట జయహో కేజ్రీవాల్ అనిపించుకుని ఆయన సిగ్గుమాలిన పని చేశారని మండిపడ్డారు.
గతంలో ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ విధులు నిర్వహించిన సమయంలోనూ పంద్రాగస్టు వేడుకల్లో ఆమె పేరును ప్రదర్శించారని, లెఫ్టినెంట్ గవర్నర్ పేరులాగా కూడా విద్యార్థులు నిలబడతారని, ఈ పద్ధతి మారాలని ప్రభుత్వాధికారి ఒకరు వివరణ ఇవ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications