వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాళీ మాతపై వివాదాస్పద వ్యాఖ్యలు-నిర్మాణ మణిమేకలైకు ఢిల్లీ కోర్టు సమన్లు

|
Google Oneindia TeluguNews

కాళీమాతపై నిర్మాత లీనా మణిమేకలై అనుచిత వ్యాఖ్యల వివాదం రోజుకో ములుపు తిరుగుతోంది. కాళీ మాత మాంసం తింటుందంటూ, సిగరెట్ కాలుస్తుందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత బెంగాల్ లో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా దానికి కొనసాగింపుగా చేసిన కామెంట్లతో ఈ వ్యవహారం రచ్చకు కారణమవుతోంది.

ఈ నేపథ్యంలో లీనా మణిమేకలై వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. దీంతో కాళీ దేవత సిగరెట్ తాగుతున్నట్లు చిత్రీకరించకుండా నిరోధించాలని కోరుతూ పిటిషన్ వేసిన నిర్మాత లీనా మణిమేకలై, ఇతరులకు ఢిల్లీ కోర్టు ఇవాళ సమన్లు ​​జారీ చేసింది. మణిమేకలైపై హిందూ దేవతని చాలా 'పిలువలేని రీతిలో' చిత్రించినందుకు, దేవత సిగరెట్ తాగుతున్నట్లు చూపించిన చిత్రం పోస్టర్, ప్రమోషనల్ వీడియో నేపథ్యంలో మణిమేకలైపై కేసు నమోదైంది. వాది మణిమేకలైపై శాశ్వత, తప్పనిసరి నిషేధం కోరుతూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు.

Delhi court summons to filmmaker Leena Manimekalai over Kaali row

సినిమా పోస్టర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, నైతికత, మర్యాదలకు విరుద్ధమని పిటిషనర్లు ఢిల్లీ కోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా మణిమేకలై తన ట్విట్టర్ హ్యాండిల్ నుండి పోస్టర్‌ను ట్వీట్ చేశారని ఫిర్యాదుదారు ఆరోపించారు. దీంతో విచారణ జరిపిన కోర్టు.. ఆమెకు సమన్లు జారీ చేయడంతో పాటు తదుపరి విచారణను ఆగస్టు 6న కోర్టు వాయిదా వేసింది.

English summary
delhi court on today issued summons to film maker manimekalai for her comments on kaali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X