ఢిల్లీ ఎన్నికలు: 4 సర్వేలు బీజేపీకే, 51సీట్లు మావేనని కేజ్రీవాల్ పార్టీ

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో సర్వేలు రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీయే గెలుస్తుందని కొన్ని సర్వేలు, కాదు.. కాదు బీజేపీ గెలుస్తుందని మరికొన్ని సర్వేలు చెబుతున్నాయి. సర్వేల్లో నాలుగు బీజేపీకే అనుకూలంగా ఉన్నాయని పీటీఐ వార్తాసంస్థ కథనం పేర్కొంది.

బీజేపీకి 3 సీట్లు వస్తాయని ఇండియా టీవీ-సీ ఓటరు సర్వేలో, 36 సీట్లు వస్తాయని వీక్-ఐఎంబీఆర్ సర్వేలో-ఐబీఎన్7 సర్వేలో తేలింది. జీటీవీ సర్వే కూడా బీజేపీకి 32-36 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ సొంత సర్వే, ఇండియా టుడే సర్వేలు ఏఏపీకి అనుకూలంగా వచ్చాయి.

ఢిల్లీ పోరులో గెలుపెవరిది? ఢిల్లీ ఎన్నికల్లో గాలి ఎటువైపు వీస్తోంది? కాబోయే ముఖ్యమంత్రి మఫ్లర్‌ వాలా కేజ్రీవాలా? లేక ఐరన్‌ లేడీ కిరణ్‌ బేడీయా? ఢిల్లీ ఓటరు ప్రత్యేక తీర్పు చెబుతారా? అన్నీ ఉత్కంఠ కొనసాగుతోంది. సర్వేలు కూడా అటు ఇటు చెప్పడంతో ఈ ఉత్కంఠ మరింత కొనసాగుతోంది.

Delhi Elections 2015: BJP may touch majority mark, say Surveys, AAP internal survey gives itself 51

మొన్నటిదాకా అత్యధిక సర్వేలు బీజేపీకి జై కొట్టాయి. ఆ తర్వాత ఏఏపీకి జై కొట్టాయి. తాజాగా వెలువడిన సర్వే ఫలితాల్లో ఏకంగా మూడు సర్వేలో ఢిల్లీలో కమల వికాసం తథ్యమని అంచనా వేశాయి. బీజేపీ 37 స్థానాలు సొంతం చేసుకుంటుందని, ఏఏపీకి 27 దక్కుతాయని ఇండియా టీవీ-సీ ఓటర్‌ సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ ఏడు సీట్లకు పరిమితమవుతుందని పేర్కొంది.

జీ-తలీమ్‌ సర్వే బీజేపీ 32 నుంచి 36 సీట్లు, ఏఏపీకి 30 నుంచి 34 దక్కుతాయని పేర్కొంది. కాంగ్రె‌స్‌కు ఆరు మాత్రమే ఇచ్చింది. న్యూ నేషనల్‌ చానల్‌ బీజేపీకి 30-35, ఏఏపీకి 30-34, కాంగ్రెస్‌కు 3-5 స్థానాలు దక్కుతాయని అంచనా వేసింది.

ఇండియా టుడే-సిసిరో సర్వే మాత్రం ఆప్‌ 38 నుంచి గరిష్ఠంగా 46 స్థానాలు దక్కించుకుంటుందని తెలిపింది. బీజేపీ 19 నుంచి 25 గెలుచుకుంటే గొప్ప అని తెలిపింది. టైమ్స్‌ నౌ సర్వే ప్రకారం ఆప్‌కు 34, బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 4 స్థానాలు దక్కుతాయి.

ఏఏపీ మాత్రం తాము విజయభేరీ మోగించడం ఖాయమని తమ అంతర్గత సర్వేలను ఉటంకిస్తూ చెబుతోంది. స్వయంగా సర్వే నిపుణుడు, ఆప్‌ నాయకుడైన యోగేంద్ర యాదవ్‌ అంచనా ప్రకారం... ఢిల్లీలో గాలి మరింత జోరుగా వీస్తే 57 కూడా వస్తాయంటున్నారు. తమకు 51 సీట్లు వస్తాయని, బీజేపీకి 15 వస్తాయని, కాంగ్రెస్, ఇతరులకు నాలుగు సీట్లు వస్తాయని ఏఏపీ చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+