వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నామినేషన్ వేసిన కేజ్రీ, కిరణ్.. సంక్షోభం లేదు: రాజ్‌నాథ్(ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు జామ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

గతంలో పోలిస్తే అరవింద్ కేజ్రీవాల్ సంపద ఈసారి రూ. 2లక్షలకు తగ్గింది. ఆయన తన ఆదాయ వివరాలను నామినేషన్ పత్రాల్లో దాఖలు చేశారు. తనపై 10 కేసులున్నాయని కేజ్రీవాల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు. మంగళవారమే నామినేషన్ వేసేందుకు బయల్దేరిన కేజ్రీవాల్ రోడ్ షోకు అభిమానులు పోటెత్తడంతో నామినేషన్ వేయలేకపోయిన విషయం తెలిసిందే.

నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తాను పోటీ చేస్తుంది ఏ వ్యక్తిపైనో, ఏ పార్టీపైనో కాదన్నారు. తాను పోటీ చేస్తుంది కేవలం అవినీతికి, పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా మాత్రమేనన్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్ పార్టీకి పరిమిత స్థాయిలో మెజారిటీని అందించారన్న కేజ్రీవాల్ ఫిబ్రవరిలో జరుగనున్న ఎన్నికల్లో ఐదేళ్లు పరిపాలించేలా పూర్తి మెజారిటీ ఇవ్వాలని ప్రజలను కోరారు

ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ కూడా నామినేషన్ వేశారు. ఢిల్లీలోని కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ నామినేషన్ వేశారు. ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణబేడీ రూ.11.65కోట్లు ఆస్తులున్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు.

ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో తన పేరు,తన భర్తపేరుతో ఉన్న స్థిర, చరాస్తుల మొత్తం విలువ రూ.11.65కోట్లు అని కిరణ్‌బేడీ వెల్లడించారు. తనపై ఏ కోర్టులోగానీ ఎటువంటి కేసులు లేవని అఫిడవిట్‌లో స్పష్టం చేశారు.

ఈ నామినేషన్ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అలాగే అజయ్ మాకెన్ సహా పలువురు సీనియర్ నేతలు కూడా నేడు నామినేషన్ వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్లకు బుధవారం చివరి రోజు కావడంతో అభ్యర్ధులు పోటెత్తారు.

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు జామ్ నగర్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

గతంలో పోలిస్తే అరవింద్ కేజ్రీవాల్ సంపద ఈసారి రూ. 2లక్షలకు తగ్గింది. ఆయన తన ఆదాయ వివరాలను నామినేషన్ పత్రాల్లో దాఖలు చేశారు. తనపై 10 కేసులున్నాయని కేజ్రీవాల్ అఫిడవిట్ లో పేర్కొన్నారు.
 నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ కూడా నామినేషన్ వేశారు. ఢిల్లీలోని కృష్ణనగర్ నియోజకవర్గం నుంచి కిరణ్ బేడీ నామినేషన్ వేశారు.

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ

నామినేషన్ వేసిన కేజ్రీవాల్, కిరణ్ బేడీ


ఈ నామినేషన్ కార్యక్రమంలో ఢిల్లీ బీజేపీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అలాగే అజయ్ మాకెన్ సహా పలువురు సీనియర్ నేతలు కూడా నేడు నామినేషన్ వేయనున్నారు.

ఢిల్లీ బీజేపీలో సంక్షోభం లేదు: రాజ్‌నాథ్ సింగ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవటంలో భారతీయ జనతా పార్టీలో ఎలాంటి సంక్షోభం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న తమ పార్టీకి ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలో తెలుసని అన్నారు.

తామంటే గిట్టని పార్టీలు బీజేపీలో సంక్షోభం ఉందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అలాంటి పార్టీలకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ నేతలు ఐక్యమత్యంగా పనిచేస్తున్నారని చెప్పారు. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ముఖ్య అతిథిగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటనకు అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

English summary
BJP's CM candidate Kiran Bedi and AAP chief Arvind Kejriwal on Wednesday filed their nomination papers amid increasing verbal duel between the main challengers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X