మోడీ, అమిత్ షా జోడీకి ఎదురు దెబ్బ: ఢిల్లీ ఫలితాలపై ఆర్ఎస్ఎస్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఫలితాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు మరో రకంగా సంతోషాన్ని కలిగిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా జోడీకి ఈ ఫలితాలు ఎదురు దెబ్బ అని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. నరేంద్ర మోడీ ఏకపక్ష వైఖరికి ఈ ఫలితాలు నిదర్శనమని భావిస్తున్నాయి.
బిజెపిని పూర్తిగా నియంత్రణలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా జోడీ పునరాలోచనలో పడడానికి ఈ ఫలితాలు అవకాశం కల్పించాయని భావిస్తున్నాయి. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగపూర్ నుంచి వార్తాకథనాలు వచ్చాయి. బిజెపికి ఈ ఫలితాలు త్వరగా గుణపాఠం చెప్పాయని ఆర్ఎస్ఎస్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. దానివల్ల మోడీ, షా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి అవకాశం కల్పిస్తారని అనుకుంటున్నారు.

 Delhi elections 2015 results: A jolt Modi and Shah needed, says a section in RSS

నిజానికి, పది కోట్ల మంది సభ్యులను చేర్చుకోవడం ద్వారా ప్రంపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించడానికి బిజెపి ప్రయత్నిస్తోంది. అయితే, ఆ పార్టీని మోడీ, అమిత్ షా ఇద్దరు మాత్రమే నియంత్రించాలనే ఆలోచనలో నడుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపి వ్యతిరేక ఓటు వల్ల గెలిచిందని, మోడీ వ్యతిరేక ఓటు వల్ల కాదని ఆర్ఎస్ఎస్ సీనియర్ సిద్ధాంతకర్త ఎండి వైద్య వ్యాఖ్యానించారు.

నరేంద్ర మోడీ, అమిత్ షా తాము ఇద్దరు మాత్రమే అయి పార్టీని ముందుకు నడిపించాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారనేది సాధారణమైన అభిప్రాయంగా ఉంది. ఆర్ఎస్ఎస్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు అర్థమవుతోంది. ఢిల్లీ ఫలితాలు నేర్పిన గుణపాఠంతో వారిద్దరు తమ వైఖరులను మార్చుకుంటారని ఆర్ఎస్ఎస్ భావిస్తోంది. ఇంత త్వరగా గుణపాఠంగా ఢిల్లీ ఫలితాలు రావడం బిజెపికి మేలు చేస్తుందని కూడా అనుకుంటున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+