Delhi Exit Polls 2025: గతంలో నిజమైన ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ ఏవి ? చరిత్ర ఏం చెబుతోంది ?

ఢిల్లీ అసెంబ్లీకి ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కాసేపట్లో ముగియబోతున్నాయి. అనంతరం ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువరించేందుకు పలు సర్వే సంస్థలు, ఏజెన్సీలు, జాతీయ మీడియా సంస్థలు ఎదురుచూస్తున్నాయి. అసలే ఆప్, బీజేపీ మధ్య ఈసారి ఢిల్లీలో సాగిన పోరు జాతీయ స్ధాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఢిల్లీలో హ్యాట్రిక్ విజయాల తర్వాత ఈసారి ఆప్ ఏం చేయబోతోందనే చర్చతో పాటు కేంద్రంలో మూడోసారి గెలిచిన బీజేపీ ఢిల్లీని గెలుస్తుందా లేదా అన్న ఉత్కంఠ పెరిగిపోతోంది. దీంతో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో అసలు ఎగ్జిట్ పోల్స్ గత చరిత్ర ఎలా ఉందో చూద్దాం..

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాక సాయంత్రం 6.30 నుంచి ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు గతంలో 2015, 2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనా పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. 2020లో సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ వాస్తవానికి దగ్గరగా వచ్చాయి. అయినా ఆప్ సీట్ల సంఖ్యను తక్కువగా అంచనా వేశాయి. సగటున ఎనిమిది సర్వేలు ఆప్‌కి 54 సీట్లు, బీజేపీకి 15 సీట్లు వస్తాయని అంచనా వేయగా..ఆప్ 62 సీట్లు గెలుచుకుంది, అప్పట్లో 8 ఎగ్జిట్ పోల్స్‌లో 5 ఫలితాలు వాస్తవమయ్యాయి.

Delhi Exit Polls 2025 what 2015 and 2020 predictions say

అంతకు ముందు 2015లో జరిగిన ఎన్నికల్లో చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఆప్ విజయాన్ని అంచనా వేసినప్పటికీ దాని సైజును అంచనా వేయలేకపోయాయి. ఆరు ప్రధాన ఎగ్జిట్ పోల్స్ సగటున ఆప్ దాదాపు 45 సీట్లు సాధిస్తుందని అంచనా వేయగా.. ఆప్ 67 సీట్లు గెలిచింది. బీజేపీ 24, కాంగ్రెస్ ఒకటి గెలుస్తుందని పోల్స్ అంచనా వేస్తే.. వాస్తవానికి బిజెపికి కేవలం మూడు సీట్లు వచ్చాయి. అలాగే కాంగ్రెస్‌కు ఒక్కటి కూడా రాలేదు. అలాగే ఆప్ 60 సీట్ల మార్కును దాటుతుందని ఏ పోల్ ఊహించలేదు. కేవలం యాక్సిస్ మై ఇండియా పోల్ మాత్రమే 53 సీట్లను అంచనా వేసి 50కి మించి ఉంటుందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+