Delhi Exit Polls: బీజేపీ భారీ విజయాన్ని తేల్చేసిన యాక్సిస్‌మైఇండియా, సీఎన్ఎక్స్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బుధవారం సాయంత్రం ముగియడంతో పలు సర్వే, మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేలో మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ కూడా ఢిల్లీలో బీజేపీదే అధికారమని తేల్చి చెప్పాయి. కొన్ని సర్వేలు మాత్రం హోరాహోరీ పోరాటం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య జరుగుతోందని తెలిపాయి.
మెజార్టీ సర్వే సంస్థలు బుధవారమే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయగా.. గురువారం సాయంత్రం యాక్సెస్ మైఇండియా, సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రెండు ఎగ్జిట్ పోల్స్ కూడా ఢిల్లీలో బీజేపీ భారీ విజయం సాధిస్తుందని తేల్చేశాయి. ఇక, అధికార ఆమ్ ఆద్మీ పార్టీ చాలా తక్కువ సీట్లకే పరిమితమవుతుందని పేర్కొన్నాయి.

యాక్సెస్‌మైఇండియా ఎగ్జిట్ పోల్స్ అంచనా లప్రకారం.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి 15-25 సీట్లు చ్చే అవకాశం ఉందని పేర్కొంది. 42 శాతం ఓట్ షేర్ వస్తుందని తెలిపింది. ఇక, బీజేపీకి 45-55 సీట్లు వస్తాయని, 48 శాతం ఓటింగ్ షేర్ వస్తుందని యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కాంగ్రెస్ పార్టీ, ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది.
సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఢిల్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంనది పేర్కొన్నాయి. సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఆమ్ ఆద్మీ పార్టీకి 41.52 ఓటు షేర్‌తో 10-19 సీట్లు వస్తాయి. ఇక, బీజేపీకి 49-61 సీట్లు వస్తాయని, 49.05 శాతం ఓటు షేర్ నమోదైంది. కాంగ్రెస్ పార్టీ, ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశం ఉందని తెలిపాయి. కాంగ్రెస్ పార్టీకి 5.37 శాతం ఓటు షేర్ వచ్చింది.
ఇది ఇలావుండగా, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. ఢిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, భారత ఎన్నికల సంఘం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్‌జనశక్తి రాం విలాస్ పాసవాన్ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. కాగా, అసలైన ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న విడుదల కానున్నాయి.












Click it and Unblock the Notifications