మద్యం తాగించి మహిళపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్‌రేప్
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒంటరిగా ఉన్న మహిళపై బస్సు డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి కొట్వాలి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది.
40 ఏళ్ల బాధితురాలు బస్సు కోసం ఎదురు చూస్తుండగా, ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ బ్రీజేంద్ర, కండక్టర్ జితేంద్ర ఆమెను బలవంతంగా బస్సులోకి లాక్కెళ్లారు. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
అత్యాచారానికి ముందు బాధితురాలికి నిందితులు బలవంతంగా మద్యం తాగించారు. కాగా, బాధితురాలు కేకలు వేయడంతో స్థానికులు బస్సు వద్దకు చేరుకున్నారు. బాధితురాలిని కాపాడిన స్థానికులు, ఇద్దరు నిందితులను చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు.

ప్రాణం తీసిన మెమొరీ కార్డు
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లా తులసీపురంలో దారుణం జరిగింది. మెమొరీ కార్డు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్(16) అనే యువకుడు తన ఇంటికి సమీపంలోని శోభారామ్ అనే వ్యక్తి మొబైల్ ఫోన్‌లో నుంచి మెమొరీ కార్డును దొంగిలించాడు.
ఇది గమనించిన శోభారామ్.. అనిల్‌కు విషమిచ్చి దారుణంగా కొట్టాడు. ఇంటికి చేరుకున్న అనిల్ వాంతులు చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అనిల్ కుటుంబ సభ్యులు బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే అనిల్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు శోభారామ్ పరారీలో ఉన్నాడు.
-
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications